Amazon: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చేస్తోంది! 40-75 శాతం డిస్కౌంట్లతో అదిరిపోయే ఆఫర్లు!

ABN , First Publish Date - 2023-09-26T15:56:29+05:30 IST

ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ త్వరలో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. తాజాగా అమెజాన్ కూడా కస్టమర్లకు తీపి కబురు చెప్పింది.

Amazon: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చేస్తోంది! 40-75 శాతం డిస్కౌంట్లతో అదిరిపోయే ఆఫర్లు!

ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ త్వరలో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. తాజాగా అమెజాన్ కూడా కస్టమర్లకు తీపి కబురు చెప్పింది. త్వరలోనే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. సేల్‌కు సంబంధించిన పేజీ ఇప్పటికే అమెజాన్ హోమ్ పేజీలో ఉంది. అయితే ఈ సేల్ ఎప్పటి నుంచి ప్రారంభంకానుందనే విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు. కానీ నివేదికల ప్రకారం అక్టోబర్ 10 నుంచి ఈ సేల్ ప్రారంభంకానుంది. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఒక రోజు ముందుగానే సేల్ అందుబాటులోకి రానుంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీనిని బట్టి చూస్తే రానున్న దసరా, దీపావళి పండుగలను క్యాష్ చేసుకోవడానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాన్ చేసుకున్నాయని అర్థం అవుతుంది.


సేల్‌కు సంబంధించిన పేజీ ఇప్పటికే అమెజాన్‌లో లైవ్‌లో ఉంది. దీనిని బట్టి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో డిస్కౌంట్ లభించే వస్తువులు, డిస్కౌంట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లపై మంచి ఆఫర్లున్నాయి. iPhone 13, OnePlus 11R, iQOO Neo 7 Pro మరిన్ని 5G ఫోన్‌లపై డిస్కౌంట్ లభించనుంది. ఫోన్‌లు, యాక్సెసరీలపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తామని అమెజాన్ వాగ్దానం చేస్తోంది. స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లు, మరిన్నింటిపై 75 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి రూ.40,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. ఇక టాబ్లెట్‌లపై 60 శాతం వరకు తగ్గింపు ఉండనుంది. అయితే పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో డిస్కౌంట్ పొందే కొన్ని ఫోన్‌ల పేర్లను టీజర్ పేజీ ధృవీకరించింది. OnePlus 11R, Samsung Galaxy S23, iQOO Neo 7 Pro, OnePlus 11, OnePlus Nord 3, Motorola Razr 40 Ultra వంటి స్మార్ట్‌ఫోన్‌లపై మంచి ఆఫర్లు లభిస్తాయని Amazon విక్రయ పేజీ పేర్కొంది. Samsung Galaxy M14, iQOO Z6 Lite, Redmi 12, OnePlus Nord CE 3 Lite, iQOO Z7s వంటి ఇతర ప్రముఖ ఫోన్‌లు కూడా అమెజాన్‌లో తక్కువ ధరకు లభించనున్నాయి. అయితే ఖచ్చితమైన ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఆ వివరాలను వెల్లడించే అవకాశాలున్నాయి.

మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. సేల్ పేజీలో ఉన్న వివరాల ప్రకారం.. Samsung Galaxy S21 FE 5G, ఐఫోన్‌లపై డిస్కౌంట్ లభించనుంది. ఐఫోన్ అమ్మకాలు అక్టోబర్ 1న వెల్లడవుతాయని టీజర్ పేజీ ధృవీకరించింది. Samsung, Realme ఫోన్ డీల్స్ వరుసగా అక్టోబర్ 3, అక్టోబర్ 6న ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అదేవిధంగా Redmi ఫోన్ల కోసం అక్టోబర్ 7 వరకు వేచి ఉండవలసి ఉంటుంది. Oppo మొబైల్స్ అమ్మకాలు అక్టోబర్ 8న ప్రారంభమవుతాయి. అదే రోజు Poco ఫోన్‌ల అమ్మకాలు ప్రారంభయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54 (Samsung Galaxy F54), ఐఫోన్ 13 (iPhone 13), పిక్సల్ 7ఏ (Pixel 7a), పోకో ఎక్స్ 5 ప్రో (Poco X5 Pro), శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఆల్ట్రా (Samsung Galaxy S23 Ultra), పిక్సల్ 7 ప్రొ (Pixel 7 Pro), శాంసంగ్ గెలాక్సీ ఏ 34 (Samsung Galaxy A34), రెడ్ మీ నోట్ 12 ప్రో (Redmi Note 12 Pro), పోకో ఎఫ్ 5 (Poco F5), శాంసంగ్ గెలాక్సీ ఏ23 (Samsung Galaxy A23), ఒప్పో రెనో 10 (Oppo Reno 10), మోటరోలా, Motorola G54, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 13 (Samsung Galaxy F13) వంటి స్మార్ట్ ఫోన్‌లపై డిస్కౌంట్ లభించనుంది.

Updated Date - 2023-09-28T19:29:28+05:30 IST