Team India: భారీ ఆదాయంపై కన్నేసిన బీసీసీఐ.. వచ్చే ఐదేళ్లలో రూ.8,200 కోట్లు.. ఒక్కో మ్యాచ్‌కు ఎంతంటే..?

ABN , First Publish Date - 2023-08-05T17:53:56+05:30 IST

వచ్చే ఐదేళ్ల కాలంలో స్వదేశంలో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లకు సంబంధించిన టీవీ, డిజిటల్ హక్కులను విక్రయించడంపై బీసీసీఐ దృష్టి పెట్టింది. ఈ విక్రయం ద్వారా బిలియన్ డాలర్లు అనగా మన కరెన్సీలో రూ.8,200 కోట్లు ఆర్జించవచ్చని బీసీసీఐ అంచనా వేస్తోంది. అంటే వచ్చే ఐదేళ్లలో బీసీసీఐపై కనక వర్షం కురవనుందనే చెప్పుకోవాలి.

Team India: భారీ ఆదాయంపై కన్నేసిన బీసీసీఐ.. వచ్చే ఐదేళ్లలో రూ.8,200 కోట్లు.. ఒక్కో మ్యాచ్‌కు ఎంతంటే..?

వచ్చే ఐదేళ్ల కాలంలో స్వదేశంలో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లకు సంబంధించిన టీవీ, డిజిటల్ హక్కులను విక్రయించడంపై బీసీసీఐ దృష్టి పెట్టింది. ఈ విక్రయం ద్వారా బిలియన్ డాలర్లు అనగా మన కరెన్సీలో రూ.8,200 కోట్లు ఆర్జించవచ్చని బీసీసీఐ అంచనా వేస్తోంది. అంటే వచ్చే ఐదేళ్లలో బీసీసీఐపై కనక వర్షం కురవనుందనే చెప్పుకోవాలి. కాగా వచ్చే ఐదేళ్లలో అనగా 2023-2028 మధ్య కాలంలో స్వదేశంలో టీమిండియా 88 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో అత్యధికంగా ఆస్ట్రేలియాతో 21 మ్యాచ్‌లు(5 టెస్టులు, 6 వన్డేలు, 10 టీ20లు) ఆడనుంది. ఇంగ్లండ్‌తో 18 మ్యాచ్‌లు(10 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు) ఆడనుంది. ఇక మిగతా జట్లతో 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అంటే సగటును ఒక్కో మ్యాచ్‌కు రూ.90 కోట్లు దక్కనున్నాయి. కాగా గత ఐదేళ్ల కాలంలో అనగా 2018-2023కు గానూ స్వదేశంలో జరిగిన మ్యాచ్‌ల టీవీ, డిజిటల్ హక్కులను స్టార్ ఇండియా 944 మిలియన్ల డాలర్లకు దక్కించుకుంది. 2018 డాలర్ విలువ ప్రకారం ఇది రూ.6,138 కోట్లు. అంటే ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్‌కు సగటును రూ.60 కోట్లు దక్కాయి.


గత ఐపీఎల్ సీజన్‌కు ముందు బీసీసీఐ టీవీ, డిజిటల్ హక్కుల వేలాన్ని సపరేటుగా నిర్వహించిన సంగతి తెలిసిందే. టీవీ హక్కులను స్టార్, డిజిటల్ హక్కులను రిలయన్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీనిద్వారా బీసీసీఐకి రూ.48,390 కోట్ల ఆదాయం సమకూరింది. దీంతో టీమిండియాకు సంబంధించిన ప్రసార హక్కులను కూడా టీవీ, డిజిటల్‌ రూపంలో సపరేట్‌గా నిర్వహించనున్నారు. కాగా వేలంలో ఈ సారి టీవీ హక్కుల కంటే డిజిటల్ హక్కులు ఎక్కువ ధర పలుకుతాయని పలువురు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో జరిగే వేలంలో పాల్గొనడానికి రూ.15 లక్షల విలువైన బిడ్ డాక్యుమెంట్లను అనేక కంపెనీలు ఇప్పటికే కొనుగోలు చేశాయి. అయితే టీమిండియా ప్రసార హక్కుల కొనుగోలు కోసం ప్రధానంగా మూడు కంపెనీల మధ్య పోటీ ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ రేసులో డీస్నీ+హాట్ స్టార్, రిలయన్స్-వయాకామ్, జీ-సోనీ ఉన్నాయని అని సమాచారం. మరోవైపు టీవీ, డిజిటల్ హక్కులకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియను ఈ-ఆక్షన్ ద్వారా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండగా.. సెప్టెంబర్ మొదటి వారంలో వేలం నిర్వహించనున్నారు.

Updated Date - 2023-08-05T17:53:56+05:30 IST