Share News

Gill-Kishan: నా చొక్కా నాకు తిరిగి ఇచ్చేయ్.. ఇషాన్ కిషన్ పోస్ట్‌కు శుభ్‌మన్ గిల్ ఫన్నీ కామెంట్

ABN , First Publish Date - 2023-12-13T10:36:11+05:30 IST

టీమిండియా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఎంత సరదాగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరు కలిసి చేసే చిలిపి పనులు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Gill-Kishan: నా చొక్కా నాకు తిరిగి ఇచ్చేయ్.. ఇషాన్ కిషన్ పోస్ట్‌కు శుభ్‌మన్ గిల్ ఫన్నీ కామెంట్

టీమిండియా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఎంత సరదాగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరు కలిసి చేసే చిలిపి పనులు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. టీమిండియా భవిష్యత్ స్టార్లుగా భావిస్తున్న గిల్, కిషన్ గురించి తెలుసుకోవడానికి అభిమానులు కూడా తెగ ఆసక్తి చూపుతున్నారు. గిల్, కిషన్ బ్రోమాన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా అలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఇషాన్ కిషన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన రెండు ఫోటోలను పోస్ట్ చేశాడు. దానికి బ్లూప్రింట్ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ రెండు చిత్రాల్లో కిషన్ నీలం, నలుపు రంగులు గల చొక్కాలను ధరించాడు. ఈ పోస్ట్‌పై అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే కిషన్ స్నేహితుడు గిల్ కూడా స్పందిచాడు. మీరు నా చొక్కా నాకు తిరిగి ఇచ్చి ఉండవచ్చు అని ఫన్నీగా రాసుకొచ్చాడు. “భాయ్ షర్ట్ తో వాపిస్ దే దేటా (మీరు నా చొక్కా నాకు తిరిగి ఇచ్చి ఉండవచ్చు)” అని అన్నాడు.


గిల్ కామెంట్ ప్రకారం కిషన్ ధరించి ఫోటోలకు పోజులిచ్చిన ఆ రెండు చొక్కాలు అతనివే అయి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ గిల్ చొక్కాలను కిషన్ దొంగిలించి ధరించి ఉండవచ్చని ఫన్నీ రాసుకొస్తున్నారు. మరికొందరేమో ఆ చొక్కాలు కిషన్‌వే అయి ఉంటాయని, కానీ అతడిని ఆటపట్టించేందుకు గిల్ సరదాగా అలా కామెంట్ చేసి ఉండొచ్చని అంటున్నారు. మరికొందరేమో ఆ చొక్కాల్లో కిషన్ చాలా అందంగా ఉన్నాడని రాసుకొస్తున్నారు. ఏది ఏమైనా కిషన్ పోస్ట్, గిల్ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 19 గంటల క్రితం షేర్ చేసిన ఈ పోస్ట్‌కు ఇప్పటివరకు 8.3 లక్షల లైక్‌లు వచ్చాయి. కాగా మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చోటు లభించలేదు. శుభ్‌మన్ గిల్ ఆడినప్పటికీ డకౌట్ అయ్యాడు.

Updated Date - 2023-12-13T10:40:00+05:30 IST