నేను భారత్‌కు ఎప్పటికీ వెళ్లను.. టీమిండియాపై విషం కక్కిన పాక్ లెజెండ్

ABN , First Publish Date - 2023-06-20T17:57:25+05:30 IST

పాకిస్థాన్ ఆటగాళ్లు మరోసారి భారత్‌పై విషం చిమ్మారు. బీసీసీఐ(BCCI) టీమిండియాను (Team India) పాకిస్థాన్ (Pakistan) పంపడానికి అంగీకరించే వరకు, ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) పాల్గొనడానికి పాకిస్థాన్ క్రికెట్ జట్టు వెళ్లకూడదని పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ (Javed Miandad) పీసీబీకి (PCB) సూచించాడు.

నేను భారత్‌కు ఎప్పటికీ వెళ్లను.. టీమిండియాపై విషం కక్కిన పాక్ లెజెండ్

పాకిస్థాన్ ఆటగాళ్లు మరోసారి భారత్‌పై విషం చిమ్మారు. బీసీసీఐ(BCCI) టీమిండియాను (Team India) పాకిస్థాన్ (Pakistan) పంపడానికి అంగీకరించే వరకు, ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) పాల్గొనడానికి పాకిస్థాన్ క్రికెట్ జట్టు వెళ్లకూడదని పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ (Javed Miandad) పీసీబీకి (PCB) సూచించాడు. కాగా 66 ఏళ్ల జావేద్ మియాందాద్ ప్రస్తుతం భారత్‌కు ప్రతిస్పందించాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాడు. 2012, 2016లో పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించిందని, కాగా ప్రస్తుతం భారత జట్టు వంతు వచ్చిందని అన్నాడు.

93867188.webp

"నేను ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను. నేను ఏ మ్యాచ్ ఆడటానికి భారతదేశానికి వెళ్లను. అది ప్రపంచ కప్ కూడా. మేము భారత్‌తో ఆడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. కానీ భారత్ మాత్రం అదే విధంగా స్పందించడం లేదు. పాకిస్థాన్ క్రికెట్ చాలా పెద్దది.. మేము ఇప్పటికీ నాణ్యమైన ఆటగాళ్లను తయారు చేస్తున్నాము. కాబట్టి మేం భారత్‌కు వెళ్లకపోయినా దాని వల్ల మాకు ఏదైనా తేడా వస్తుందని నేను అనుకోను. ఒకరు తమ పొరుగు వారు ఫలానా వారే ఉండాలని ఎప్పుడూ ఎంచుకోలేరు. కాబట్టి ఒకరికొకరు సహకరించుకుంటూ జీవించడం మంచిదని నేను ఎప్పుడూ చెబుతాను. క్రికెట్ అనేది మనుషులను ఒకరికొకరని మరింత దగ్గరి చేసి, దేశాల మధ్య అపార్థాలు, మనోవేదనలు తొలగించగల క్రీడ అని నేను ఎప్పుడూ చెబుతాను" అని మియాందాద్ చెప్పుకొచ్చాడు.

చివరగా ఆసియాకప్ కోసం టీమిండియాను పాకిస్థాన్ పంపించడం లేదు. కాబట్టి ప్రస్తుతం పాకిస్థాన్ కూడా బలమైన స్టాండ్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నాడు.

Rohit-and-Babar-ICC.webp

కాగా నిజానికి ఆగస్టులో పాకిస్థాన్ వేదికగా ఆసియా కప్‌ జరగాల్సి ఉంది. కానీ భారత్ అక్కడ ఆడడానికి నిరాకరించింది. తటస్థ వేదికైన యూఏఈలో జరపాలని చూసినా సాధ్యం కాలేదు. దీంతో చేసేదేమి లేక టోర్నీని హైబ్రిడ్ పద్దతిలో శ్రీలంక, పాకిస్థాన్‌లో నిర్వహిస్తున్నారు. అయితే మెజారీటీ మ్యాచ్‌లు శ్రీలంకలోనే జరగనున్నాయి. భారత్ తమ మ్యాచ్‌లన్నింటిని శ్రీలంకలోనే ఆడనుంది. దీంతో తాము భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనకూడదని పాకిస్థాన్ మొదట భావించినప్పటికీ తర్వాత వెనక్కి తగ్గింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే మియాందాద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కానీ మియాందాద్ అన్నట్టుగా ప్రస్తుతం బీసీసీఐతో వివాదం పెట్టుకునే స్థితిలో పీసీబీ లేదు. కాగా పాకిస్థాన్‌లో భారత జట్టు చివరగా 2008లో పర్యటించింది.

Updated Date - 2023-06-20T17:57:25+05:30 IST