IND vs AUS: తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరం!

ABN , First Publish Date - 2023-09-21T15:41:47+05:30 IST

భారత్‌తో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, గ్లెయిన్ మాక్స్‌వెల్ తొలి వన్డేకు దూరమ్యారు. ఈ విషయాన్ని ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ అధికారికంగా ప్రకటించాడు.

IND vs AUS: తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరం!

భారత్‌తో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, గ్లెయిన్ మాక్స్‌వెల్ తొలి వన్డేకు దూరమ్యారు. ఈ విషయాన్ని ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ అధికారికంగా ప్రకటించాడు. గజ్జల్లో నొప్పి కారణంగా స్టార్క్, చీలిమండ గాయం కారణంగా మాక్స్‌వెల్ తొలి వన్డే మ్యాచ్‌కు దూరం కానున్నారు. ఇక గాయాల కారణంగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ కమిన్స్, సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ పూర్తిగా కోలుకున్నారు. దీంతో వీరిద్దరు భారత్‌తో వన్డే సిరీస్‌లో బరిలోకి దిగనున్నారు. అటు భారత జట్టును కూడా గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నారు. టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాకు తొలి రెండు వన్డేలకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తొలి రెండు వన్డేలకు భారత జట్టుకు కేఎల్ రాహుల్ నేతృత్వం వహించనున్నాడు. కాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభంకానుది. 22న తొలి వన్డే, 24 రెండో వన్డే, 27న మూడో వన్డే మ్యాచ్ జరగనుంది.


తొలి రెండు వన్డేలకు భారత జట్టు

కేఎల్ రాహుల్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

మూడో లేదా చివరి వన్డేకు భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్

ఆస్ట్రేలియా వన్డే జట్టు

పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

Updated Date - 2023-09-21T15:41:47+05:30 IST