Share News

IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్‌పై అదిరిపోయే అప్‌డేట్!

ABN , First Publish Date - 2023-10-21T10:40:48+05:30 IST

క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒక శుభవార్త. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ 2024 సీజన్ కూడా భారత్‌లోనే జరగనుందని సమాచారం. ఈ మేరకు క్రికెట్ అభిమానులకు బీసీసీఐ త్వరలోనే శుభవార్త చెప్పనుందని తెలుస్తోంది.

IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్‌పై అదిరిపోయే అప్‌డేట్!

క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒక శుభవార్త. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ 2024 సీజన్ కూడా భారత్‌లోనే జరగనుందని సమాచారం. ఈ మేరకు క్రికెట్ అభిమానులకు బీసీసీఐ త్వరలోనే శుభవార్త చెప్పనుందని తెలుస్తోంది. ఈ సారి లీగ్‌ను విదేశాల్లో నిర్వహించనున్నారనే వార్తలను ఐపీఎల్‌ అరుణ్ ధుమాల్ తోసిపుచ్చినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఈ సారి కూడా లీగ్ భారత్‌లోనే నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన హింట్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే జరుగుతుంటుంది. కానీ ఈ సారి ఐపీఎల్ జరిగే సమయంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగున్నాయి. దీంతో ఐపీఎల్ నిర్వహణకు భద్రతపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలుంటాయి. పైగా గతంలో దేశంలో లోక్ సభ ఎన్నికలు జరిగిన సమయంలో ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించారు. అప్పుడు లీగ్‌కు యూఏఈ, సౌతాఫ్రికా వంటి దేశాలు అతిథ్యం ఇచ్చాయి. దీంతో ఈ సారి కూడా లీగ్‌ను విదేశాల్లోనే నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ తాజాగా వస్తున్న వార్తలతో లీగ్‌ను మన దేశంలోనే నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఏది ఏమైనా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక గత ఐపీఎల్ ట్రోఫిని చెన్నైసూపర్ కింగ్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్‌లో ఓడిన గుజరాత్ టైటాన్స్ రన్నరఫ్‌తో సరిపెట్టుకుంది.

Updated Date - 2023-10-21T11:32:04+05:30 IST