Share News

IND vs AUS: చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా.. మూడో టీ20లో గెలిస్తే..

ABN , First Publish Date - 2023-11-28T07:06:39+05:30 IST

IND vs AUS 3rd T20: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే మొదటి రెండు టీ20 మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు సిరీస్‌లో 2-0తో అధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం జరిగే మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

IND vs AUS: చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా.. మూడో టీ20లో గెలిస్తే..

గువాహటి: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే మొదటి రెండు టీ20 మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు సిరీస్‌లో 2-0తో అధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం జరిగే మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో భారత జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్‌లో వెనుకబడిన ఆస్ట్రేలియా జట్టు ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత జట్టు రికార్డు నెలకొల్పనుంది. టీ20 క్రికెట్‌ అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించనుంది. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 211 మ్యాచ్‌లాడిన టీమిండియా 135 విజయాలు సాధించింది. అదే సమయంలో పాకిస్థాన్ కూడా 226 మ్యాచ్‌ల్లో 135 మ్యాచ్‌లు గెలిచింది. ప్రస్తుతం పొట్టి ఫార్మాట్‌లోఅత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్ల జాబితాలో భారత్, పాకిస్థాన్ మొదటి స్థానంలో ఉన్నాయి. టీమిండియా మరొక మ్యాచ్‌ గెలిస్తే పాకిస్థాన్ రికార్డును అధిగమించి అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించనుంది. దీంతో మంగళవారం జరిగే మ్యాచ్‌లో గెలిచి టీమిండియా ఈ రికార్డు అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.


మంగళవారం జరిగే మ్యాచ్‌లో రెండు జట్ల ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండే అవకాశాలున్నాయి.

తుది జట్లు (అంచనా)

భారత్‌: యశస్వీ జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్, ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, అక్షర్ పటేల్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్ సింగ్‌, ప్రసిద్ధ్ కృష్ణ‌, ముకేశ్‌ కుమార్‌.

ఆస్ట్రేలియా: స్టీవ్‌ స్మిత్‌, షార్ట్‌, ఇన్‌గ్లి్‌స, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, స్టొయినిస్‌, టిమ్‌ డేవిడ్‌, వేడ్‌ (కెప్టెన్‌), జంపా, ఎల్లిస్‌, బెహ్రెన్‌డార్ఫ్‌, తన్వీర్‌ సంఘా.

Updated Date - 2023-11-28T07:06:41+05:30 IST