Share News

World Cup: విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాకు లభించిన ప్రైజ్ మనీ ఎంతంటే..?

ABN , First Publish Date - 2023-11-20T11:58:34+05:30 IST

World Cup prize money: దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను విపరీతంగా అలరించిన వన్డే ప్రపంచకప్ ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరో సారి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. టీమిండియా రన్నరఫ్‌గా నిలిచింది. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ట్రోఫీతోపాటు 4 మిలియన్ డాలర్ల పైజ్ మనీని గెలచుకుంది.

World Cup: విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాకు లభించిన ప్రైజ్ మనీ ఎంతంటే..?

దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను విపరీతంగా అలరించిన వన్డే ప్రపంచకప్ ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరో సారి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. టీమిండియా రన్నరఫ్‌గా నిలిచింది. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ట్రోఫీతోపాటు 4 మిలియన్ డాలర్ల పైజ్ మనీని గెలచుకుంది. దీని విలువ భారత కరెన్సీలో రూ.33 కోట్లుగా ఉంటుంది. రన్నరఫ్‌గా నిలిచిన టీమిండియాకు 2 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ లభించింది. దీని విలువ భారత కరెన్సీలో రూ.16 కోట్లు. సెమీ ఫైనల్ చేరిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లకు 8 లక్షల డాలర్ల చొప్పున ప్రైజ్ మనీ అందింది. ఇది భారత కరెన్సీ రూ.6.5 కోట్లుగా ఉంటుంది. వీటితోపాటు టోర్నీలో పాల్గొన్న మిగతా 6 జట్లకు లక్ష డాలర్ల చొప్పున ప్రైజ్ మనీ అందనుంది. భారత కరెన్సీలో ఇది రూ.82 లక్షలుగా ఉంటుంది. ఇది కాకుండా అన్ని జట్లకు గ్రూప్ దశలో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు 40 వేల చొప్పున ప్రైజ్ మనీ లభించనుంది. ఇది భారత కరెన్సీలో రూ.33 లక్షలుగా ఉంటుంది.


పదికి పది విజయాలతో దూసుకెళ్లిన టీమిండియాను ఆదివారం జరిగిన వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా అడ్డుకుంది. పక్కా ప్రణాళికతో, ప్రశాంత చిత్తంతో బరిలోకి దిగిన ఈ జట్టు అన్ని విభాగాల్లోనూ చెలరేగింది. తద్వారా 6 వికెట్లతో నెగ్గి వన్డే వరల్డ్‌కప్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆసీస్‌ కెరీర్‌లో ఇది ఆరో టైటిల్‌ కావడం విశేషం. గాయంతో తొలి ఐదు మ్యాచ్‌లకు దూరమైన ట్రావిస్‌ హెడ్‌ (120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 137) ఈ విజయానికి కారణమయ్యాడు. అతడికి లబుషేన్‌ (110 బంతుల్లో 4 ఫోర్లతో 58 నాటౌట్‌) సహకరించడంతో మూడో వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. రాహుల్‌ (66), విరాట్‌ (54), రోహిత్‌ (47) మాత్రమే రాణించారు. స్టార్క్‌కు మూడు.. కమిన్స్‌, హాజెల్‌వుడ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఆసీస్‌ 43 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు చేసి గెలిచింది. బుమ్రాకు 2 వికెట్లు లభించాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హెడ్‌ నిలిచాడు.

Updated Date - 2023-11-20T13:59:11+05:30 IST