Share News

IND vs NZ: టాస్ మనదే.. తుది జట్టులో రెండు కీలక మార్పులు చేసిన టీమిండియా!

ABN , First Publish Date - 2023-10-22T13:48:13+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా ఫీల్డింగ్ చేస్తామని చెప్పాడు.

IND vs NZ: టాస్ మనదే.. తుది జట్టులో రెండు కీలక మార్పులు చేసిన టీమిండియా!

ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా ఫీల్డింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే గత మ్యాచ్‌లో గాయపడిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో ఆడడం లేదని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో తుది జట్టులో రెండు మార్పులు చేసినట్లు రోహిత్ పేర్కొన్నాడు. గాయపడిన హార్దిక్ పాండ్యాతోపాటు శార్దూల్ ఠాకూర్‌ను కూడా తుది జట్టు నుంచి తప్పించినట్టు తెలిపాడు. వీరిద్దరి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీలను తుది జట్టులోకి తీసుకున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు.

అటు న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ మాట్లాడుతూ.. తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపాడు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్టు పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో రెండు జట్లు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాయి. కాగా ఇప్పటివరకు టోర్నీలో నాలుగేసి మ్యాచ్‌ల చొప్పున గెలిచిన భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దీతో ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంటుంది. ఇక వన్డే ప్రపంచకప్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 8 సార్లు తలపడ్డాయి. అత్యధికంగా కివీస్ 5, భారత్ 3 మ్యాచ్‌లు గెలిచాయి.


తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

Updated Date - 2023-10-22T14:58:18+05:30 IST