Share News

IND vs SA: ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్.. అత్యంత వేగంగా..

ABN , First Publish Date - 2023-12-13T08:18:23+05:30 IST

Suryakumar Yadav: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 2 వేల పరుగులను పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ ఆరోన్ ఫించ్ రికార్డును బ్రేక్ చేశాడు.

IND vs SA: ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్.. అత్యంత వేగంగా..

ఎబేహ: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 2 వేల పరుగులను పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ ఆరోన్ ఫించ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఆరోన్ ఫించ్ 1283 బంతుల్లో 2 వేల పరుగులను పూర్తి చేశాడు. తాజాగా సూర్యకుమార్ యాదవ్ 1164 బంతుల్లోనే 2 వేల పరుగుల మార్కు అందుకున్నాడు. దీంతో ఇప్పటివరకు ఆరోన్ ఫించ్ పేరు మీద ఉన్న రికార్డు బ్రేక్ అయింది. మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఈ రికార్డును అందుకున్నాడు. అలాగే ఇన్నింగ్స్‌ల పరంగా టీ20 క్రికెట్‌లో వేగంగా 2 వేల పరుగుల చేసిన మూడో బ్యాటర్‌గా మిస్టర్ 360 డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి సమంగా నిలిచాడు. వీరిద్దరు 56 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కు అందుకున్నారు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ డకౌట్లు అయినప్పటికీ సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ హాఫ్ సెంచరీలతో చెలరేగి జట్టును ఆదుకున్నారు. తిలక్ వర్మ 29, రవీంద్ర జడేజా 19 పరుగులు చేశారు. అయితే వర్షం రావడంతో మరో 3 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా ఇన్నింగ్స్‌ను ముగించాల్సి వచ్చింది. 9 ఫోర్లు, 2 సిక్సులతో 39 బంతుల్లో 68 పరుగులు చేసిన రింకూ సింగ్ నాటౌట్‌గా నిలిచాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో రింకూ సింగ్‌కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ. వర్షం ఆగాక డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో సౌతాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లో 152 పరుగులుగా నిర్ణయించారు. అయితే 13.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా లక్ష్యాన్ని చేధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-13T08:41:26+05:30 IST