Share News

IND vs NZ Semi Final: గుడ్ న్యూస్.. టాస్ మనమే గెలిచామోచ్!

ABN , First Publish Date - 2023-11-15T13:44:18+05:30 IST

India vs New Zealand: వన్డే ప్రపంచకప్ మొదటి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌లో కీలకమైన టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుంకా బరిలోకి దిగుతోంది.

IND vs NZ Semi Final: గుడ్ న్యూస్.. టాస్ మనమే గెలిచామోచ్!

ముంబై: వన్డే ప్రపంచకప్ మొదటి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌లో కీలకమైన టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుంకా బరిలోకి దిగుతోంది. అటు న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్‌లో తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. ఈ వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా 18 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి నాలుగు ఓడిన న్యూజిలాండ్ నాలుగో స్థానంతో సెమీస్ చేరింది. కాగా లీగ్ దశలో రెండు జట్ల మధ్య జరిగిన పోరులో టీమిండియానే గెలిచింది.

తుది జట్లు

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మాన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్


గత రికార్డులు

ముంబైలోని వాంఖడే పిచ్‌పై ఇప్పటివరకు 27 వన్డే మ్యాచ్‌లు జరగగా 14 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 13 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. ఈ ప్రపంచకప్‌లో ఇక్కడ జరిగిన 4 మ్యాచ్‌ల్లో మూడు సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఒక సారి మాత్రమే సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. ఈ ప్రపంచకప్‌లో వాంఖడే పిచ్‌పై మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 357 పరుగులు కాగా.. రెండో ఇన్నింగ్స్ సగటు 187గా ఉంది. ఇక ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ జట్లు వన్డే ప్రపంచకప్ చరిత్రలో 10 సార్లు తలపడ్డాయి. అత్యధికంగా కివీస్ 5 మ్యాచ్‌ల్లో, భారత్ 4 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. మొత్తంగా వన్డే ఫార్మాట్లో రెండు జట్లు 117 సార్లు తలపడ్డాయి. అత్యధికంగా భారత్ 59 మ్యాచ్‌లు గెలవగా.. న్యూజిలాండ్ 50 గెలిచింది. ఒక మ్యాచ్ టై కాగా ఏడు మ్యాచ్‌లు రద్దయ్యాయి.

Updated Date - 2023-11-15T13:47:41+05:30 IST