Share News

World cup: మరో 77 పరుగులు చేస్తే చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లీ.. భారత్, శ్రీలంక దిగ్గజాల రికార్డులు బ్రేక్!

ABN , First Publish Date - 2023-10-19T12:28:35+05:30 IST

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో చరిత్రాత్మక రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 77 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 26 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 25,923 పరుగులు ఉన్నాయి.

World cup: మరో 77 పరుగులు చేస్తే చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లీ.. భారత్, శ్రీలంక దిగ్గజాల రికార్డులు బ్రేక్!

పుణె: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో చరిత్రాత్మక రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 77 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 26 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 25,923 పరుగులు ఉన్నాయి. ఇప్పటివరకు 510 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 566 ఇన్నింగ్స్‌ల్లో ఈ పరుగులు సాధించాడు. అయితే కోహ్లీ మరో 34 ఇన్నింగ్స్‌ల్లో మిగతా 77 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 26,000 పరుగులు సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడు. సచిన్ 600 ఇన్నింగ్స్‌ల్లో 26 వేల పరుగులు పూర్తి చేశాడు. దీంతో సచిన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో 26 వేల పరుగులు సాధించిన నాలుగో క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పుతాడు. అంతేకాకుండా కింగ్ కోహ్లీ మరో 34 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక మాజీ ఆటగాడు మహేల జయవర్దనే రికార్డును అధిగమిస్తాడు. ఈ క్రమంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకుంటాడు. జయవర్దనే 25,957 పరుగులు చేయగా.. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 25,923 పరుగులు ఉన్నాయి. అయితే వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు గురువారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్‌లోనే కోహ్లీ ఆ రెండు రికార్డులను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Updated Date - 2023-10-19T12:28:35+05:30 IST