Share News

IND vs BAN: ఆరేళ్ల తర్వాత మళ్లీ బౌలింగ్ చేసిన కింగ్ కోహ్లీ.. వీడియో ఇదిగో!

ABN , First Publish Date - 2023-10-19T16:32:23+05:30 IST

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆరేళ్ల తర్వాత మళ్లీ బంతి పట్టుకున్నాడు. చివరగా 2017లో బౌలింగ్ చేసిన కోహ్లీ తాజాగా మళ్లీ బంతి పట్టుకుని బరిలోకి దిగాడు.

IND vs BAN: ఆరేళ్ల తర్వాత మళ్లీ బౌలింగ్ చేసిన కింగ్ కోహ్లీ.. వీడియో ఇదిగో!

పుణె: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆరేళ్ల తర్వాత మళ్లీ బంతి పట్టుకున్నాడు. చివరగా 2017లో బౌలింగ్ చేసిన కోహ్లీ తాజాగా మళ్లీ బంతి పట్టుకుని బరిలోకి దిగాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 9వ ఓవర్ బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా 3 బంతులు వేశాక గాయపడ్డాడు. బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్‌ను ఆపే ప్రయత్నంలో హార్దిక్ గాయపడ్డాడు. కాలు బెనకడంతో టీమిండియా ఫిజియో వచ్చి పరీక్షించాడు. చికిత్స చేసినప్పటికీ బౌలింగ్ చేయడానికి ఇబ్బందిపడ్డాడు. దీంతో హార్దిక్ మైదానాన్ని వీడాడు. మిగతా మూడు 3 బంతులను విరాట్ కోహ్లీ వేశాడు. సాధారణంగా రైటార్మ్ మీడియం పేసరైన కోహ్లీ మిగతా 3 బంతులు వేసి 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కాగా ఈ టోర్నీ ఆరంభానికి ముందే పరిస్థితులను బట్టి తాను విరాట్ కోహ్లీ బౌలింగ్ కూడా చేస్తామని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన సంగతి తెలిసిందే. 2017లో కొలంబోలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ బౌలింగ్ వేశారు. ఆ మ్యాచ్‌లో 2 ఓవర్లు వేసి 12 పరుగులిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన చివరి వికెట్‌ను కోహ్లీ 2014లో తీశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన కోహ్లీ.. ఆ జట్టు స్టార్ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్‌ను ఔట్ చేశాడు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ 93 పరుగుల మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అయితే 15వ ఓవర్లో ఈ భాగస్వామ్యాన్ని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బ్రేక్ చేశాడు. తాంజిద్ హసన్(51)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో(8)ను రవీంద్ర జడేజా, మెహిదీ హసన్ మిరాజ్(3)ను సిరాజ్, లిటన్ దాస్(66)ను జడేజా ఔట్ చేశారు. దీంతో బంగ్లాదేశ్ 137 పరుగులకే టాప్ 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒకనొక దశలో 93/0తో బలంగా కనిపించిన ఆ జట్టు 44 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయింది.

Updated Date - 2023-10-19T16:32:23+05:30 IST