Share News

World Cup Final: ఆస్ట్రేలియా 450/2, టీమిండియా 65 ఆలౌట్.. ఫైనల్ మ్యాచ్‌పై స్టార్ క్రికెటర్ జోస్యం!

ABN , First Publish Date - 2023-11-18T11:22:42+05:30 IST

Mitchell Marsh Prediction: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అతిథ్య జట్టు టీమిండియా, ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన ఆస్ట్రేలియా తలపడనున్నాయి. స్టార్ క్రికెటర్ మిచెల్ మార్ష్ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం భారత అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

World Cup Final: ఆస్ట్రేలియా 450/2, టీమిండియా 65 ఆలౌట్.. ఫైనల్ మ్యాచ్‌పై స్టార్ క్రికెటర్ జోస్యం!

అహ్మదాబాద్: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. నెలన్నర రోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ప్రపంచకప్‌లో ఇంకా ఒకే ఒక మ్యాచ్ మిగిలింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అతిథ్య జట్టు టీమిండియా, ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ప్రస్తుతం టోర్నీలో రెండు జట్లు సూపర్ ఫామ్‌లో ఉండడంతో ప్రపంచకప్ ఏ జట్టు గెలుస్తుందనేది ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. సమవుజ్జీల మధ్య పోరు కావడంతో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ తప్పేలా లేదు. మరోవైపు ఫైనల్ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఫైనల్ పోరులో ఏ జట్టు గెలుస్తుందనే అంశంపై పలువురు జోస్యం కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో స్టార్ క్రికెటర్ మిచెల్ మార్ష్ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం భారత అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.


అసలు మార్ష్ ఏం చెప్పాడంటే.. గత మే నెలలో ఢిల్లీ క్యాపిల్స్ ఫ్రాంచైజీ నిర్వహించిన పోడ్‌కాస్ట్‌లో మిచెల్ మార్ష్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడతాయని చెప్పాడు. అయితే ఫైనల్‌లో టీమిండియా ఓడిపోతందని జోస్యం చెప్పాడు. అది కూడా దారుణంగా ఓడిపోతుందని వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా 450/2 పరుగుల చేస్తే, టీమిండియా 65 పరుగులకే ఆలౌటవుతుందని అన్నాడు. "ఆస్ట్రేలియా భారత్‌ను ఓడిస్తుంది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా 450/2, భారత్ 65 ఆలౌట్" అని అన్నాడు. కాగా ఐపీఎల్‌లో మిచెల్ మార్ష్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టులో మార్ష్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. అయితే మార్ష్ గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం టీమిండియా అభిమానులను కంగారుకు గురి చేస్తున్నాయి. మరికొందరు మాత్రం మార్ష్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. ఫైనల్‌లో టీమిండియానే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ సంగతి కాస్త పక్కన పెడితే మార్ష్ అంచనా వేసిన విధంగానే ఈ ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ చేరడం గమనార్హం.

కాగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడం ఇది మొదటి సారి ఏం కాదు. 2003 ప్రపంచకప్ ఫైనల్‌లో కూడా భారత్ ఆస్ట్రేలియానే తలపడ్డాయి. కానీ ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. దీంతో ఈ సారి ఆస్ట్రేలియాను ఓడించి భారత జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తంగా భారత్ ఇప్పటివరకు రెండు సార్లు వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకోగా.. ఆస్ట్రేలియా ఏకంగా 5 సార్లు గెలిచింది. ఇక భారత్ చివరగా ఐసీసీ ట్రోఫీ గెలిచి 10 సంవత్సరాలు అవుతుంది. 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫినీ టీమిండియా కైవసం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా చివరగా 2021 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది.

Updated Date - 2023-11-18T11:29:18+05:30 IST