Share News

Year-Ender-2023: సంవత్సరాంతపు సెలవులలో మరింత మజా కావాలా? ఈ ఎవర్ గ్రీన్ ప్లేసుల వైపు ఓ కన్నేయండి..!

ABN , Publish Date - Dec 21 , 2023 | 01:43 PM

ప్రతి వ్యక్తి విజయం వెనుక కుటుంబం, భాగస్వామి, స్నేహితుల పాత్ర చాలానే ఉంటుంది. ఏడాది ముగింపును వీరితో మరచిపోలేని జ్ఞాపకంగా మార్చుకోవాలని చాలామంది అనుకుంటారు. ఈ సంతోషం మరింత రెట్టింపు కావడానికి భారతదేశంలో ఎంతో గుర్తింపు పొందిన పర్యాటక ప్రాంతాలు ఆహ్వానం పలుకుతున్నాయి.

Year-Ender-2023: సంవత్సరాంతపు సెలవులలో మరింత మజా కావాలా? ఈ ఎవర్ గ్రీన్ ప్లేసుల వైపు ఓ కన్నేయండి..!

2023 ముగింపుకు వచ్చేసింది. ఈ ఏడాది ఎంతో మంది జీవితాలు ఎన్నో మలుపులు తిరిగి ఉంటాయి. సంతోషం, బాధ, దుఃఖం, విజయాలు, అపజయాలు మొదలైనవి ప్రతి ఒక్కరిని పలకరించి ఉంటాయి. ఈ సందర్బాలలో తోడున్నవారు, స్పూర్తినిచ్చిన వారు, విజయానికి సహకరించినవారు ఉండనే ఉంటారు. ముఖ్యంగా ప్రతి వ్యక్తి విజయం వెనుక కుటుంబం, భాగస్వామి, స్నేహితుల పాత్ర చాలానే ఉంటుంది. ఏడాది ముగింపును వీరితో మరచిపోలేని జ్ఞాపకంగా మార్చుకోవాలని చాలామంది అనుకుంటారు. ఈ సంతోషం మరింత రెట్టింపు కావడానికి భారతదేశంలో ఎంతో గుర్తింపు పొందిన పర్యాటక ప్రాంతాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ ప్రాంతాలకు వెళితే ఏడాది చివరి రోజులను తమ జీవితంలో అత్యుత్తమంగా మలచుకోవడం, కొత్త ఏడాదికి హృదయపూర్వకంగా స్వాగతం చెప్పడం కూడా చేయవచ్చు. భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టపడే ఈ ప్రదేశాల లిస్ట్ ఒకసారి గమనిస్తే..

అండమాన్ & నికోబార్ దీవులు.. ( Andaman and Nicobar Islands)

ఈ దీవులలో బీచ్ లు ఎంతో అందంగా ఉంటాయి. అనంతమైన సముద్రపు నీరు నీలిరంగులో ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ సూర్యాస్తమయాలు, సూర్యోదయాలు మనసును కట్టిపడేస్తాయి. ఈ ప్రాంతంలో గిరిజన సంచారం, వారి వంటకాలు కొత్త రుచులను, కొత్తదనాన్ని ఇష్టపడేవారికి ఎక్స్ట్రా ఫన్ అందిస్తుంది.

Stomach bloating: భోజనం చేసిన తరువాత కడుపు ఉబ్బరంగా ఉంటుందా? ఈ చిట్కాలు పాటిస్తే ..!



గోవా..(goa)

యువత ఎక్కువగా ఇష్టపడే భారతీయ టూరిస్ట్ ప్లేస్ గోవా. కొత్త సంవత్సరాన్ని చాలా ఉత్సాహంతో ఆహ్వానించాలని అనుకుంటే దానికి గోవానే బెస్ట్. బీచ్ ఒడ్డున పార్టీలు, కొత్త వ్యక్తుల పరిచయం, సముద్రపు హోరు నూతనోత్సాహాన్ని ఇస్తాయి.

కేరళ..(Kerala)

దేశంలో కేరళకు ప్రత్యేక స్థానం ఉంది. పచ్చదనంతో కళకళలాడే కేరళ చాలా మందికి ఇష్టమైన టూరిస్ట్ ప్లేస్. హిల్ స్టేషన్లు, బీచ్ లు, అడవులు, విశాలమైన జలపాతాలు, మున్నార్ లోని హిల్ స్టేషన్లు టూరిస్ట్ లను ప్రకృతి ఒడిలో ఊయలలూపుతాయి.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే.. గంపెడు లాభాలు!


ఉదయపూర్..(Udaipur)

ఉదయపూర్ కోట ఎవర్ గ్రీన్. చరిత్రమీద ఆసక్తి ఉన్నవారికి ఉదయ పూర్ కోట సంవత్సరాంతపు మంచి హాట్ స్పాట్. ఇక్కడ రాజభవనాలలో రాజ జీవితాన్ని గడిపే సదుపాయం ఉంటుంది. అదొక మరచిపోలేని జ్ఞాపకంగా మిగులుతుంది. వీరి వంటకాలు కూడా ఆహారప్రియులను ఊరిస్తాయి. రాజస్థానీ దుస్తులతో కూడిన షాపింగ్ మాల్స్ జిగేలుమంటాయి.

సిమ్లా..(Simla)

పర్వతాలు, కొండలు, పొగమంచు మధ్య తడిసి ముద్దవుతూ గొప్ప క్షణాలను పోగేసుకోవాలంటే సిమ్లా గొప్ప స్పాట్. మంచు కొండల మధ్య గంభీరమైన నిశ్శబ్దం, సూర్యుడి లేత కిరణాలు, ఫైన్ చెట్లతో కూడిన వాతావరణంలో నిలుచుంటే చిత్రాకారుడు గీసిన పెయింట్ మధ్యలో ఉన్నామా అనే అనుభూతిని ఇస్తాయి.

ఇది కూడా చదవండి: రాత్రిపూట హాయిగా నిద్రపట్టాలంటే.. ఈ పనులు చెయ్యండి చాలు!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Updated Date - Dec 21 , 2023 | 01:43 PM