Share News

Stomach bloating: భోజనం చేసిన తరువాత కడుపు ఉబ్బరంగా ఉంటుందా? ఈ చిట్కాలు పాటిస్తే ..!

ABN , Publish Date - Dec 20 , 2023 | 04:26 PM

ఏం తినాలన్నా, తాగాలన్నా బాగా ఇబ్బంది పెట్టే కడుపు ఉబ్బరం సమస్య ఈ చిట్కాలు పాటిస్తే సెట్ కావాల్సిందే..

Stomach bloating: భోజనం చేసిన తరువాత కడుపు ఉబ్బరంగా ఉంటుందా? ఈ చిట్కాలు పాటిస్తే ..!

ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకోవడం కామన్. అది లేకపోతే ఏ పని చేయడానికి శక్తి ఉండదు. కొందరు భోజనం తరువాత కడుపు ఉబ్బరంగా ఉంటుందని కంప్లైంట్ చేస్తుంటారు. దీని కారణంగా ఎప్పుడైన ఎక్కడైనా తమకు నచ్చిన ఫుడ్ కళ్లముందు ఉన్నా కడుపు నిండుగా తినడానికి ఇబ్బంది పడతారు. మరికొందరిలో కొంచెం తిన్నా సరే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. కడుపులో గ్యాస్ సమస్య కారణంగా కడుపు ఉబ్బరం వస్తుంది. ఇది ప్రాణాలు తీసే సమస్య కాకపోయినా దీనివల్ల చాలా అసౌకర్యం, భవిష్యత్తులో ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. భోజనం తరువాత కడుపు ఉబ్బరం ఉండకూడదంటే కింది టిప్స్ పాటిస్తే సరి(stomach bloating reduce tips).

భోజనం తరువాత అల్లం టీ(ginger tea) తీసుకుంటే కడుపు ఉబ్బరం సమస్య ఉండదు. అల్లం తురుము నీళ్ళలో వేసి ఉడికించి కాస్త తేనెతో తీసుకోవాలి. ఇది కడుపు ఉబ్బరం తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది కూడా.

ఇది కూడా చదవండి: తల్లిదండ్రులు చిన్నతనం నుండే పిల్లలలో పెంచాల్సిన 8 అలవాట్లు ఇవీ..!


చాలామంది భోజనం చేసేటప్పుడు శీతలపానీయాలు(cool drinks), చక్కెర పానీయాలు తాగుతుంటారు. భోజనం తరువాత వీటిని తీసుకుంటే కడుపులో యాసిడ్లు పెరగడానికి దారితీస్తుంది. ఇది కడుపు ఉబ్బరానికి కారణం అవుతుంది. అందుకే వీటిని అవాయిడ్ చెయ్యాలి.

భోజనం చేసేటప్పుడు హడావిడిగా ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తినడం కొందరి అలవాటు. దీనివల్ల కూడా కడుపు ఉబ్బరం వస్తుంది. ఆహారాన్ని బాగా నమిలి తినాలి(eating slowly). ఇలా చేస్తే జీర్ణక్రియ సజావుగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: రాత్రిపూట హాయిగా నిద్రపట్టాలంటే.. ఈ పనులు చెయ్యండి చాలు!


క్రమం తప్పకుండా వ్యాయామం(exercise) చెయ్యడం వల్ల జీర్ణవ్యవస్థలో గ్యాస్ కదలికలు చురుగ్గా ఉంటాయి. ఇది ఉబ్బరం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజూ వ్యాయామం అలవాటు చేసుకోవాలి.

ఇది కూడా చదవండి: Curd in Winter: చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యమేనా? ఈ నిజాలు తెలిస్తే..!


అన్నింటికంటే ముఖ్యంగా కడుపు ఉబ్బరం సమస్యకు ఎక్కువగా కారణమయ్యేది భారీ ఆహారం(heavy food) తీసుకోవడం. పెద్ద మొత్తంలో నూనె, తీపి, ప్రోటీన్ కలిగిన ఆహారాలు తీసుకుంటే అవి జీర్ణం కావడం కష్టమై అజీర్తి చేస్తుంది. దీనివల్ల కడుపులో గ్యాస్ ఏర్పడి కడుపు ఉబ్బరం సమస్య ఏర్పడుతుంది. కాబట్టి వీలైనవరకు ఆహారంలో భారీ ఆహారం తొలగించి తేలికగా ఉన్న ఆహారం తీసుకోవాలి.

(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న విషయాల ఆధారంగా రూపొందించిన సమాచారం. ఆరోగ్యం గురించి ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 20 , 2023 | 04:33 PM