రాత్రిపూట హాయిగా  నిద్రపట్టాలంటే..  ఈ పనులు చెయ్యండి చాలు!

 రాత్రి బాగా నిద్రపట్టాలంటే పగటి పూట చురుగ్గా ఉండాలి.  సాయంత్రం శరీరానికి శ్రమ కలిగించే వ్యాయామాలు చేయాలి.

సాయంత్రం 6 గంటల  తరువాత కెఫిన్ పానీయాలు, మద్యం అస్సలు తీసుకోకూడదు. నిద్ర సామర్థ్యాన్ని ఇది తగ్గిస్తుంది.

నైట్ డిన్నర్ లో భారీ ఆహారాన్ని మానేయాలి. దానిబదులు తేలిక ఆహారం తీసుకోవాలి.

నిద్రను చెడగొట్టే ఆలోచనలు, దిగులు ఏమైనా ఉంటే వాటిని ఒక నోట్స్ లో రాయాలి. రాత్రి అవి గుర్తురావడం ఆగిపోతాయి.

నిద్రపోవడానికి గంట ముందే ఇంట్లో ఎక్కువ వెలుతురు ఉన్న లైట్లను ఆఫ్ చేయాలి. లేత వెలుగు ఇచ్చే లైట్లను ఉంచుకోవాలి.

ఒత్తిడి, ఆందోళన సమస్యల వల్ల నిద్రపట్టకుంటే శ్వాస వ్యాయామాలు, ధ్యానం ఫాలో కావాలి.

నిద్రపోవడానికి ఉపయోగించే చాప, దిండు, పరుపు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.

ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. ఇది నిద్ర చక్రాన్ని బ్యాలెన్స్ గా ఉంచుతుంది.

నిద్రకు గంట ముందు మొబైల్ పక్కన పెట్టాలి. పుస్తకం చదవడం, చిన్నపాటి నడక, శ్వాసవ్యాయామాలు  చేయవచ్చు.