Share News

Curd in Winter: చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యమేనా? ఈ నిజాలు తెలిస్తే..!

ABN , Publish Date - Dec 20 , 2023 | 01:20 PM

చలికాలంలో చాలామంది పెరుగు దూరం పెడతారు. కానీ అసలు నిజాలు ఇవీ..

Curd in Winter: చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యమేనా?  ఈ నిజాలు తెలిస్తే..!

చలికాలంలో వేడి ఆహారాలు తీసుకోవడానికే ఎక్కువ ఇష్టపడతారు. పెరుగు, మజ్జిగ తీసుకోవడం చాలా తగ్గిస్తారు. చలికాలంలో చల్లని వాతావరణంలో పెరుగు తింటే దగ్గు, జలుబు, గొంతు సంబంధ సమస్యలు వస్తాయనని నమ్ముతారు. అందుకే మజ్జిగ, పెరుగు మానేస్తారు. కానీ చలికాలంలో పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని, ఇది శరీరానికి గొప్ప పోషణను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చలికాలంలో పెరుగు ఎందుకు తినాలో ఈ కింది కారణాలు చూస్తే ఇట్టే అర్థం అవుతుంది.

జీర్ణఆరోగ్యాన్ని కాపాడుతుంది..

చలికాలంలో జీర్ణ ఆరోగ్యం మందగిస్తుంది. జీర్ణశక్తి పెరగాలంటే ప్రోబయోటిక్స్ గల ఆహారం బాగా తీసుకోవాలి. పెరుగు ప్రోబయోటిక్స్ కు మంచి మూలం. దీన్ని తీసుకుంటే జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది. అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.

ఇది కూడా చదవండి: తల్లిదండ్రులు చిన్నతనం నుండే పిల్లలలో పెంచాల్సిన 8 అలవాట్లు ఇవీ..!


చర్మాన్ని హైడ్రేటెట్ గా ఉంచుతుంది..

చలికాలంలో పెరుగును ఆహారంలోనూ, చర్మసంరక్షణలోనూ రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. చలికి చర్మం ఎక్కువగా పొడిబారి దురదలు, చికాకులకు లోనవుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ సహజమైన ఎక్స్ఫోలియెంట్ గా పనిచేస్తుంది. ఇది మృతకణాలు తొలగించి చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది..

చలికాలంలో సూర్యుడి జాడ తక్కువగా ఉంటుంది. ఇది విటమిన్-డి లోపానికి దారితీస్తుంది. విటమిన్-డి లేకపోతే శరీరం కాల్షియం ను గ్రహించదు. కానీ పెరుగులో విటమిన్-డి తో పాటు కాల్షియం కూడా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బోలు ఎముకల వ్యాధిని, వయసుతో పాటు వచ్చే ఎముకల సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: Viral Video: చలికే వణుకు పుట్టిచ్చేట్టు ఉన్నాడుగా.. వేడి నీళ్లకోసం ఇతను చేసిన పని చూస్తే నోరెళ్ళబెడతారు!



రోగనిరోధక శక్తి పెంచుతుంది..

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణాశయం, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రెండూ బలంగా ఉంటే రోగనిరోధక శక్తి కూడా బలంగా ఉంటుంది. చలికాలపు ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలను అరికట్టడానికి ఇది సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: చలికాలంలో ముల్లంగి తింటే 9 లాభాలు!

శరీర ఉష్ట్రోగ్రత నియంత్రిస్తుంది..

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగానూ, చల్లని వాతావరణంలో శరీరాన్ని వెచ్చగానూ ఉంచడంలో పెరుగు సహాయపడుతుంది. చాలామంది చలికాలంలో నీరుతక్కువ తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. పెరుగు తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా మారుతుంది. శరీరంలో కొత్త శక్తి పుంజుకుంటుంది.

(గమనిక: ఇది ఆరోగ్య నిపుణులు, వైద్యులు పలు వేదికలలో పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 20 , 2023 | 01:30 PM