ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే.. గంపెడు లాభాలు!

గుమ్మడికాయను ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మంలో కడతారు. కానీ దీని జ్యూస్ తాగితే ఆశ్చర్యకరమైన ఫలితాలుంటాయి.

బూడిద గుమ్మడికాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

విటమిన్-ఎ,సి, ఇ, ఫైబర్, పొటాషియం, కాల్షియం బూడిద గుమ్మడికాయలో పుష్కలంగా  ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం.

షుగర్ ఉన్నవారు గుమ్మడి జ్యూస్ తాగితే చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తాయి.

గుమ్మడిలో ఫైబర్ పుష్కలంగా  ఉంటుంది.  దీన్ని తీసుకుంటే కడుపుకు సంబంధించిన సమస్యలన్నీ మాయమవుతాయి.

అధికబరువుతో ఇబ్బంది పడేవారు ఉదయాన్నే గ్లాసుడు బూడిద గుమ్మడి జ్యూస్ తాగితే ఈజీగా బరువు  తగ్గుతారు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.

బూడిదగుమ్మడికాయలో ఉండే సమ్మేళనాలు రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.

గుమ్మడి జ్యూస్ లో ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు,దగ్గు, ప్లూ వంటి సీజనల్ సమస్యలను దరిచేరనివ్వదు.