Wife: భర్త చేసిన పనితో.. ఆ మహిళ కంట ఎంతకూ ఆగని కన్నీళ్లు.. నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో..!

ABN , First Publish Date - 2023-09-04T10:43:01+05:30 IST

నిజమైన, స్వచ్చమైన ప్రేమ ఎప్పుడూ క్లిష్ట పరిస్థితులలో బయటపడుతూ ఉంటుంది. ఓ మహిళ విషయంలో అది ఇలా వ్యక్తమైంది..

Wife: భర్త చేసిన పనితో.. ఆ మహిళ కంట ఎంతకూ ఆగని కన్నీళ్లు.. నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో..!

సోషల్ మీడియాలో భార్యాభర్తలకు సంబంధించిన ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో చాలావరకు లైకులు, షేర్ ల కోసం చేసేవి ఎక్కువగా ఉంటున్నాయి. కొందరు కామెడీ చేస్తే మరికొందరు ప్రేమను నటిస్తారు. కానీ నిజమైన, స్వచ్చమైన ప్రేమ ఎప్పుడూ క్లిష్ట పరిస్థితులలో బయటపడుతూ ఉంటుంది. ఓ మహిళ విషయంలో ఆమె భర్త చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. ఆమె భర్త చేసిన పనికి ఆగకుండా కన్నీళ్లు కారుస్తూనే ఉంది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను కట్టిపడేస్తోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

పెళ్ళినాటి ప్రమాణాలలో ఎలాంటి సమస్య వచ్చినా భర్త భార్య చెయ్యి వదలనని ప్రమాణం చేస్తాడు. కానీ భార్య ఏదైనా క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, ఆమె వల్ల అతనికి నష్టం కలుగుతుందని అనిపించినా వదిలేసేవారు చాలామంది ఉన్నారు. ఆర్థిక విషయాలకు, కష్టానికి జడిసి విడిపోయే జంటలు ఎన్నో ఉన్నాయి. కానీ భార్యకు ఎంత కష్టం వచ్చినా చూసుకునే భర్త, భర్త ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తోడుగా నిలిచే భార్య అరుదు. భార్యాభర్తల ప్రేమకు(wife husband love) సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెటిజన్ల మనసులు దోచేస్తోంది. వీడియోలో ఓ భర్త గర్భవతిగా ఉన్న తన భార్యకు తల మీద వెంట్రుకలు తొలగిస్తూ కనిపిస్తాడు. అతను క్రమంగా భార్యకు గుండు కొట్టేస్తాడు. క్యాన్సర్ తో పోరాడుతున్న(wife fight with cancer) ఆమె తలమీద వెంట్రుకలు అన్నీ క్రమంగా రాలిపోతుండటంతో అతను భార్యకు గుండు కొట్టేస్తాడు(head save). కానీ జుట్టంతా పోయిందనే బాధ ఆమెలో కనపడకూడదని భార్యకు గుండు చేసిన వెంటనే అతను కూడా ట్రిమ్మర్ తో తన తలమీద వెంట్రుకలు తొలగించుకుంటాడు(husband head save for cancer wife). తనకు జుట్టు తొలగిస్తున్నంత సేపు కన్నీళ్లు పెట్టుకున్న భార్య, తనకోసం భర్త కూడా జుట్టు తొలగించుకోవడం చూసి భోరున విలపిస్తుంది(wife nonstop crying). ఆమె భర్త తన జుట్టు తొలగిస్తూ ఏమాత్రం బాధపడకుండా ఇద్దరం కలిసి క్యాన్సర్ తో పోరాడదాం అనే భరోసా ఇవ్వడం ఆమెనే కాదు ఈ వీడియో చూసిన నెటిజన్ల హృదయాలను కూడా కట్టిపడేస్తోంది.

Health Tips: పండ్లు ఆరోగ్యానికి మంచివే.. కానీ పొరపాటున రాత్రి సమయంలో వీటిని తింటే..



ఈ వీడియోను goodnews_movement అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'ఒంటరిగా ఎవరూ పోరాడరు, ప్రేమించే వారు ఎప్పుడూ పోరాటంలో తోడుంటారు' అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ మెన్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ మనసులో భావాల్ని కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. 'ఆమె చాలా అందంగా ఉంది' అని ఒకరు అన్నారు. 'ఇలాంటి సమస్యలు చెడ్డవి అనుకుంటాం కానీ చెడులో కూడా మంచి అంటే ఇదే.. ఆమెకు ఆమె భర్త మద్దతు ఎంత ఉందో స్పష్టమైంది' అని మరొకరు చెడులో కూడా మంచిని గుర్తుచేశారు. 'ఆమె, ఆమె బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నాను' అని మరొకరు ఆశాభావం వ్యక్తం చేశారు.

Woman: ఈ మహిళ ‘జులాయి’ సినిమాలో బ్రహ్మానందం టైపు.. నేరం చేసిన అరగంటకే ఎలా దొరికిపోయిందంటే..!


Updated Date - 2023-09-04T12:30:33+05:30 IST