Woman: ఈ మహిళ ‘జులాయి’ సినిమాలో బ్రహ్మానందం టైపు.. నేరం చేసిన అరగంటకే ఎలా దొరికిపోయిందంటే..!

ABN , First Publish Date - 2023-09-04T09:50:19+05:30 IST

ఓ మహిళ ఎంతో పకడ్బందీగా దొంగతనం చేసి ఇంటికి చేరుకున్న అరగంటకే దిమ్మతిరిగిపోయిందామెకు.

Woman: ఈ మహిళ ‘జులాయి’ సినిమాలో బ్రహ్మానందం టైపు.. నేరం చేసిన అరగంటకే ఎలా దొరికిపోయిందంటే..!

దొంగతనం చేయడం కూడా ఒక కళ అని అంటారు. దొంగతనం ఎలా చెయ్యాలో తెలిసినా ఆ తరువాత ఎవరికీ చిక్కకుండా జాగ్రత్త పడటంలోనే దొంగల ప్రతిభ దాగుంటుంది. కానీ కొందరు డబ్బు, వస్తువుల మీద వ్యామోహంతో దొంగతనానికి పాల్పడతారు. ఆ తరువాత వారి పొరపాటు కారణంగా దొరికిపోతుంటారు. ఓ మహిళ విషయంలో అలాగే జరిగింది. ఎంతో పకడ్బందీగా దొంగతనం చేసి ఇంటికి చేరుకున్న అరగంటకే దిమ్మతిరిగిపోయిందామెకు. అంతా సవ్యంగా జరిగిపోయిందని సంతోషపడేలోపు సీన్ రివర్సై కటకటాపాలైంది. ఈమెకు సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన గురించి పూర్తీగా తెలుసుకుంటే..

జులాయి సినిమాలో బ్రహ్మానందం దొంగతనం చేస్తూ ఫెయిల్ అవుతుంటే కడుపుబ్బా నవ్వని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇక ఆ సినిమాలో దేవుడి పూజ దగ్గర గంట కొట్టెయ్యడం, మరునిమిషంలోనే దొరికిపోవడం కూడా చాలా కామెడీగా ఉంటుంది. అయితే ఓ యువతి సీరియస్ గా దొంగతనం చేసి చిన్న మిస్టేక్ వల్ల దొరికిపోయింది. దొంగతనం చెయ్యడానికి ఎంత తెలివితేటలు ప్రయోగించినా ఎక్కడో ఏదో తప్పు దొంగలను పట్టించేస్తుంది. చైనా(China)కు చెందిన ఓ మహిళ ఇలాగే దొరికిపోయింది. చైనాకు చెందిన క్యూ అనే మహిళకు ఐ ఫోన్ 14(iPhone14) అంటే చాలా ఇష్టం. కానీ దాన్ని కొనే స్థోమత ఆమెకు లేదు. దీంతో ఆమె దొంగతనం చేసయినా ఐ ఫోన్ సొంతం చేసుకోవాలని అనుకుంది. ఇలా అనుకున్నదే తడవుగా ఆమె ఐ ఫోన్ షోరూమ్ కు వెళ్లింది. అక్కడ తనకు నచ్చిన ఐఫోన్ చూసి దాన్ని చేజిక్కించుకోవడానికి పథకం వేసింది. ఆ షోరూమ్ లో ప్రతి ఫోన్ కు సెక్యూరిటీ కేబుల్ వైర్ ఏర్పాటుచేశారు. ఇతరులు ఎవరైనా ఫోన్ చేతుల్లోకి తీసుకుంటే అక్కడి సిబ్బంది అలెర్ట్ అవుతారు. ఈ విషయం గమనించిన సదరు మహిళ ఆ ఫోన్ స్క్రీన్ పరిశీలిస్తున్నట్టు ముందుకు వంగి ఎవరూ చూడని సమయంలో ఆ ఫోన్ కు ఉన్న సెక్యురిటీ కేబుల్ ను కొరికేసింది. ఆ తరువాత మొబైల్ ను తన బ్యాగులో వేసుకుని సాధారణ కస్టమర్ లా ఎలాంటి జంకు లేకుండా అక్కడి నుండి బయటపడింది(Women theft iPhone).

Health Tips: పండ్లు ఆరోగ్యానికి మంచివే.. కానీ పొరపాటున రాత్రి సమయంలో వీటిని తింటే..



క్యూ మొబైల్ ను కొట్టేసిన తరువాత నేరుగా ఇంటికి చేరుకుంది. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు, రూ. 79,749 ల ఐ ఫోన్ తన సొంతమైనందుకు ఆమె ఎంతో సంతోషించింది. కానీ ఆమె సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ఐఫోన్ షోరూమ్ లో మొబైల్ మిస్ అయిందనే విషయం గమనించుకున్న తరువాత షోరూమ్ లో ఉన్న సీసీకెమెరాలు(CC Camera) అన్ని అక్కడి సిబ్బంది గమనించారు. అందులో మహిళ కేబుల్ వైర్ కొరకడం చూసి వారు అవాక్కయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మహిళ ఇల్లు కనుక్కుని నేరుగా ఆమె ఇంటికి చేరుకుని అక్కడే ఆమెను పట్టుకున్నారు. ఫోన్ ను స్వాధీనం చేసుకుని షోరూమ్ వారికి అందించారు.

Health Tips: పిల్లలకు ఆవు పాలు తాగిస్తున్నారా? ఈ నిజాలు తెలుసుకోకుంటే చాలా నష్టపోతారు!!


Updated Date - 2023-09-04T09:50:19+05:30 IST