Viral News: తేలు విషానికి ఎందుకంత డిమాండ్.. ఒక్క లీటర్ ధర ఏకంగా రూ.80 కోట్లకు పైగానే..!
ABN , First Publish Date - 2023-04-14T16:36:24+05:30 IST
తేలు (Scorpion).. ఈ పేరు వినగానే వామ్మో అంటాం. ఇక చుట్టుపక్కల ఎక్కడైనా అది కనిపిస్తే భయంతో అక్కడి నుంచి పరుగులు పెడతాం.
ఇంటర్నెట్ డెస్క్: తేలు (Scorpion).. ఈ పేరు వినగానే వామ్మో అంటాం. ఇక చుట్టుపక్కల ఎక్కడైనా అది కనిపిస్తే భయంతో అక్కడి నుంచి పరుగులు పెడతాం. పొరపాటున తేలు కాటుకు గురైతే ఇక అంతే సంగతులు. దాన్ని విష ప్రభావంతో చుక్కలు కనిపించడం ఖాయం. ఇక విషపూరితమైన తేలు కాటేస్తే కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. అయితే, ఈ సృష్టిలోని ప్రమాదకరమైన జీవుల్లో ఒకటైన తేలుకు మార్కెట్‌లో చాలా విలువ ఉంది. అవును మీరు విన్నది నిజమే. ఇటీవల ప్రపంచంలో అత్యంత విలువైన ద్రవంగా (Costliest Liquid) తేలు విషం (Scorpion Venom) టాప్‌లో నిలిచింది. ఇక్కడే మనకు ఒక డౌట్ వస్తుంది. ఒకవైపు విషం అంటూనే.. మళ్లీ దానికి అంత ఖరీదు ఏంటని? అక్కడికే వస్తున్నాం.
ఎందుకంటే.. తేలు విషంలో మనల్ని అంతమొందించే గుణాలకంటే కూడా ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయట. అందుకే తేలు విషం చాలా విలువైనది. కాగా, బ్రిటానియా.కామ్ (Brittanica.com) అనే వెబ్‌సైట్ డేటా ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డెత్‌స్టాకర్ తేలుకు(Deathstalker Scorpion) సంబంధించిన ఒక గ్యాలన్(4 లీటర్లు) విషం ధర 39 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ. 320 కోట్లు అన్నమాట. అంటే.. లీటర్ ధర ఏకంగా రూ.80 కోట్లు అని చెప్పాలి. ఇకపోతే ఇలా వందల కోట్ల రూపాయల ధర పలికేంతలా ఆ తేలు విషంలో ఏముంది? అసలు ఆ తేలు ప్రత్యేకతలేంటి? అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Viral Video: ఆమెతో మాట్లాడాలి.. ఎవరైనా వెళ్లి నాకు ఫోన్ చేయించండంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. ఇంతకీ ఈమె ఎవరంటే..!
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన తేలు 'డెత్‌స్టాకర్'..
డెత్‌స్టాకర్ జాతి తేళ్లు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి ఎక్కువగా నార్త్ ఆఫ్రికా (North Africa) నుంచి మిడిల్ ఈస్ట్‌లోని (Middle East) ఎడారి ప్రాంతాల్లోనే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా సహారా, అరేబియన్, థార్ సెంట్రల్, సెంట్రల్ ఏషియా ఎడారులలో జీవిస్తుంటాయి. వీటి విషంలో న్యూరో టాక్సిన్స్, క్లారోటాక్సిన్స్, క్యారిబ్డోట్యాక్సిన్స్, సిల్లాటాక్సిన్స్, ఏజిటాక్సిన్స్ ఉంటాయి. ఇక ఇది కాటేస్తే భరించడం చాలా కష్టం.
Viral News: ఈ పోలీస్ ఏంటి..? గడ్డి మోసుకెళ్తున్నాడని అవాక్కవుతున్నారా..? అసలు ఇతడెవరో.. ఎందుకీ పనిచేస్తున్నాడో తెలిస్తే..
డెత్‌స్టాకర్ విషంతో ఆరోగ్య ప్రయోజనాలు బోలేడు..
ఈ జాతికి చెందిన తేళ్ల విషం ద్వారా క్యాన్సర్‌ను కనుగొనడం, మెదడు సంబంధిత గడ్డల నివారణ, మలేరియా చికిత్సకు, డయాబెటీస్‌ను నయం చేయటంలో ఈ విషం చాలా బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం చూస్తే.. తేలు విషంలోని క్లోరోటాక్సిన్ కొన్ని రకాల క్యాన్సర్లను నివారించటంలో ఉపయోగపడుతుంది. అంతేకాదు! క్యాన్సర్ గడ్డలు ఎక్కడ ఉన్నాయో గుర్తించటం.. వాటి సైజులు కనుక్కోవటంలో చాలా సులువు. వీటితో పాటు ఎన్నో రకాలుగా వైద్యరంగంలో విషాన్ని వాడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
Viral Video: వారెవ్వా.. ఏం టెక్నిక్ బాసూ.. చేతివేలికి పెట్టిన రింగు.. ఇలా ఇరుక్కుపోతే.. నొప్పి లేకుండా ఎంత ఈజీగా తీశాడో మీరే చూడండి..!
డెత్‌స్టాకర్ విషం ఎందుకంత ఖరీదు..
ఎన్ని ఉపయోగాలు ఉంటే.. మరీ ఇంత ఖరీదా అనే అనుమానం మనకి వస్తుంది. కానీ, డిమాండ్ ఎక్కువగా ఉండి, సరఫరా తక్కువగా ఉంటే.. అలాంటి వస్తువులకు డిమాండ్ ఆటోమెటిక్‌గా అధికంగా ఉంటుందనే విషయం అందిరికి తెలిసిందే. ఇది కూడా అంతే అన్నమాట. ఇక తేలు 2.64 మిలియన్ల సార్లు విషం చిమ్మితే ఒక గ్యాలన్ అవుతుందట. ఒక తేలు నుంచి ఒకసారి కేవలం ఒక మిల్లీగ్రామ్ విషాన్ని మాత్రమే తీయగలం. అది కూడా అంత సులువేం కాదు. దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుందట. అందుకే తేలు విషానికి డిమాండ్ అధికమే.. దాని విలువ కూడా ఎక్కువే.