Viral News: ఈ పోలీస్ ఏంటి..? గడ్డి మోసుకెళ్తున్నాడని అవాక్కవుతున్నారా..? అసలు ఇతడెవరో.. ఎందుకీ పనిచేస్తున్నాడో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-04-14T15:07:36+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో (social media) తెగ వైరల్ అవుతోంది.

Viral News: ఈ పోలీస్ ఏంటి..? గడ్డి మోసుకెళ్తున్నాడని అవాక్కవుతున్నారా..? అసలు ఇతడెవరో.. ఎందుకీ పనిచేస్తున్నాడో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో (social media) తెగ వైరల్ అవుతోంది. ఫొటోలో ఆ పోలీస్ ఆఫీసర్ గడ్డి మోపును భుజాలపై ఎత్తుకెళ్లడం మనం చూడొచ్చు. ఈ నెల 13న యూపీ పోలీస్ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఫొటో చూసిన నెటిజన్లు ఓ పోలీస్ అధికారి, అది కూడా పోలీస్ డ్రెస్‌లోనే ఇంతలా కష్టపడడమేంటని ఆశ్చర్యపోతున్నారు. అయితే, అసలు ఇతడెవరో.. ఎందుకీ పనిచేస్తున్నాడో తెలిస్తే మాత్రం శభాష్ అనాల్సిందే.

అది యూపీలోని బల్లియా జిల్లా. స్థానికంగా ఉండే ఓ రైతు పొలంలో మంటలు అంటుకున్నాయి. అప్పటికే పంట కోసి ఉండడంతో ఆ రైతు కుటుంబం మంటల నుంచి పంటను కాపాడుకునేందుకు పక్కకు తరలిస్తున్నారు. అదే సమయంలో అటువైపుగా వెళ్లిన పోలీస్ అధికారి అది గమనించాడు. వెంటనే వెళ్లి రైతు కుటుంబంతో కలిసి పంట మోపులు మోశాడు. ఆ సమయంలో తీసిన ఫొటోను 'ఉత్తరప్రదేశ్ పోలీస్ అగ్నిమాపక, అత్యవసర సర్వీస్' తర అధికారిక ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. అంతే.. క్షణాల వ్యవధిలో ఆ ఫొటో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ పోలీస్ అధికారి చేస్తున్న పనిని తెలుసుకుని ప్రశంసలతో ముంచెత్తారు. 'రైతుల గోస తెలిసిన పోలీస్.. అందుకే చూస్తు ఉండలేకపోయాడు' అంటూ పొగడుతున్నారు. ఇక ఈ ఫొటోకు ఇప్పటివరకు 4వేలకు పైగా లైక్స్, 1.41లక్షల వ్యూస్ వచ్చాయి.

Viral Video: వారెవ్వా.. ఏం టెక్నిక్ బాసూ.. చేతివేలికి పెట్టిన రింగు.. ఇలా ఇరుక్కుపోతే.. నొప్పి లేకుండా ఎంత ఈజీగా తీశాడో మీరే చూడండి..!


Updated Date - 2023-04-14T15:12:07+05:30 IST