పెళ్లి కూతురి మెడలో పూల దండ వేశాడు.. మరుక్షణమే కుప్పకూలిపోయాడు.. వరుడి మరణానికి డాక్టర్లు చెప్పిన కారణమేంటో విని అంతా షాక్..!

ABN , First Publish Date - 2023-03-03T15:34:16+05:30 IST

కొందరు చేసే చిన్న చిన్న తప్పులు.. ఇంకొందరి జీవితాలనే నాశనం చేస్తుంటాయి. అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటున్న వరుడు.. కొందరు యువకులు చేసిన చిన్న తప్పు కారణంగా తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. పెళ్లి కూతురు మెడలో దండ వేశాడు.. మరుక్షణమే..

పెళ్లి కూతురి మెడలో పూల దండ వేశాడు.. మరుక్షణమే కుప్పకూలిపోయాడు.. వరుడి మరణానికి డాక్టర్లు చెప్పిన కారణమేంటో విని అంతా షాక్..!

కొందరు చేసే చిన్న చిన్న తప్పులు.. ఇంకొందరి జీవితాలనే నాశనం చేస్తుంటాయి. అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటున్న వరుడు.. కొందరు యువకులు చేసిన చిన్న తప్పు కారణంగా తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. పెళ్లి కూతురు మెడలో దండ వేశాడు.. మరుక్షణమే కుప్పకూలిపోయాడు. వరుడి మరణానికి డాక్టర్లు చెప్పిన కారణం విని అంతా షాక్ అయ్యారు. బీహార్‌లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బీహార్ (Bihar) సీతామర్హి పరిధి సోన్‌బర్సా సమీపంలోని ఇందర్వా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మణితార్ గ్రామానికి చెందిన సురేంద్రకుమార్ (30) అనే యువకుడికి ఇదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం (marriage) నిశ్చయమైంది. బుధవారం జరిగిన వివాహ కార్యక్రమానికి అతిథులంతా అధిక సంఖ్యలో చేరుకున్నారు. కాసేపటికి వేదికపై వధూవరుల జయమాల కార్యక్రమం మొదలైంది. మరోవైపు అతిథులంతా వధూవరులతో ఫొటోలు దిగుతున్నారు. ఇంకోవైపు మంటపంలో డీజే పాటలు (DJ songs) ప్లే అవుతున్నారు. అంతా సందడి సందడిగా ఉన్న సమయంలో షాకింగ్ ఘటన (Shocking incident) చోటు చేసుకుంది. డీజే పాటల సౌండ్ విపరీతంగా (loud sound) ఉండడంతో కొందరు చాలా ఇబ్బంది పడ్డారు. పాటలు ఆపాలన్నా అక్కడి యువకులు వినిపించుకోలేదు.

Viral Video: అయ్యో.. ఆంటీ.. ఇలా జరిగిందేంటి..? ఆ పెళ్లి జంటను వీడియో తీయాలనుకోవడమే ఈమె చేసిన పొరపాటయింది..!

marriage-viral-news.jpg

వేదికపై ఉన్న వరుడు ఈ సౌండ్‌కు చాలా అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించాడు. వధువు మెడలో పూల దండ వేసిన కాసేపటికి.. అంతా చూస్తుండగా కుప్పకూలిపోయాడు. దీంతో అప్పటిదాకా సందడిగా ఉన్న మంటపంలో ఒక్కసారిగా నిశ్శబ్ధం ఆవరించింది. అంతా వరుడి వద్దకు పరుగులు తీశారు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. వరుడు సురేంద్రకుమార్ అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. డీజే సౌండ్ కారణంగా అతడి గుండె ఆగినట్లు తెలిపారు. 75 డెసిబుల్స్ (75 decibels) కంటే ఎక్కువ సౌండ్ ప్లే చేయడం నేరమని, అంత సౌండ్ వింటే గుండెపోటు (heart attack) వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ కారణంగా వరుడు మృతి చెందినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకున్న వైద్యులు దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లి తర్వాత ఇలాగే జరగాలంటూ వధువు వింత కోరిక.. వరుడి తండ్రి కూడా ఒప్పుకోవడంతో.. చివరకు అంతా కలిసి..

Updated Date - 2023-03-03T15:34:16+05:30 IST