Viral Video: మహా అయితే పిల్ల పాము ఉంటుందనుకున్నారు.. చివరకు అష్టకష్టాలు పడి ఇంటి సీలింగ్‌ బద్దలు కొట్టి చూడగా..

ABN , First Publish Date - 2023-02-15T21:37:04+05:30 IST

ఇళ్లల్లో మనం ఊహించని ప్రదేశాల్లో కొన్ని కొన్ని సార్లు వింత వింత వస్తువులు, కీటకాలు, విష సర్పాలు బయటపడడం తరచూ చూస్తూనే ఉంటాం. పరుపులు, ఫ్రిడ్జ్, బూట్లు తదితరాల్లో నుంచి ఉన్నట్టుండి పాములు బయటపడడం కూడాం చూశాం. ప్రస్తుతం..

Viral Video: మహా అయితే పిల్ల పాము ఉంటుందనుకున్నారు.. చివరకు అష్టకష్టాలు పడి ఇంటి సీలింగ్‌ బద్దలు కొట్టి చూడగా..

ఇళ్లల్లో మనం ఊహించని ప్రదేశాల్లో కొన్ని కొన్ని సార్లు వింత వింత వస్తువులు, కీటకాలు, విష సర్పాలు బయటపడడం తరచూ చూస్తూనే ఉంటాం. పరుపులు, ఫ్రిడ్జ్, బూట్లు తదితరాల్లో నుంచి ఉన్నట్టుండి పాములు బయటపడడం కూడాం చూశాం. ప్రస్తుతం ఇలాంటి తరహా ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి సీలింగ్ నుంచి శబ్ధాలు రావడంతో వెళ్లి చూడగా.. మొదట ఏదో వింత ఆకారంలా కనిపించింది. చివరకు అష్టకష్టాలు పడి సీలింగ్‌ని బద్దలుకొట్టి చూడగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. మలేషియాలో (Malaysia) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చెందిన ఇంటి సీలింగ్ నుంచి శబ్ధాలు వినిపించాయి. దీంతో కంగారుగా వెళ్లి చూడగా.. మొదట్లో ఏదో వింత ఆకారంలా కనిపించింది. అనుమానం వచ్చి ఎమర్జెన్సీ సిబ్బందికి (Emergency personnel) ఫోన్ చేశారు. అక్కడికి చేరకున్న సిబ్బంది చివరకు సీలింగ్‌ను తొలగించాలని నిర్ణయించుకున్నారు. కొంత తొలగించగానే పాము తోక కనిపించింది. మహా అయితే సీలింగ్‌లో చిన్న పాము దాక్కుని ఉంటుందని అనుకున్నారు.

అయ్యో.. నా తమ్ముడిని ఎవరో చంపేసి పారిపోయారంటూ గగ్గోలు పెట్టిన యువతి.. ఆమె పనేనని పోలీసులు ఎలా తేల్చారంటే..!

python.jpg

అయితే చివరకు మొత్తం తొలగించగా షాకింగ్ దృశ్యం కనిపించింది. ఏకంగా మూడు పెద్ద పెద్ద కొండచిలువలు (pythons) ఒక్కసారిగా కిందకు వచ్చాయి. దీంతో సిబ్బంది అవాక్కయ్యారు. చివరకు అతికష్టం మీద వాటిని అక్కడి నుంచి తరలించి, సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. వీరి ఇంటికి సమీపంలోనే అటవీ ప్రాంతం (Forest area) ఉండడంతో ఇలా జరిగిందని సిబ్బంది తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: కొడితే సిక్సులు.. ఫోర్లే.. వైరల్‌గా మారిన 14 ఏళ్ల బాలిక వీడియో..!

Updated Date - 2023-02-15T21:38:18+05:30 IST