Viral Video: పరోటా మధ్యలో రూ.500 నోటును పెట్టి కాల్చగా.. చివరికి ఏమైందో చూడండి..
ABN , First Publish Date - 2023-04-11T07:25:45+05:30 IST
వినూత్న విన్యాసాలు, ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు రోజూ చేసే పనులనే కాస్త వినూత్నంగా చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. ప్రస్తుతం ఓ మహిళ చేసిన విచిత్ర ప్రయోగానికి..
వినూత్న విన్యాసాలు, ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు రోజూ చేసే పనులనే కాస్త వినూత్నంగా చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. ప్రస్తుతం ఓ మహిళ చేసిన విచిత్ర ప్రయోగానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పరోటా మధ్యలో రూ.500 నోటును పెట్టి కాల్చాలన్న ఐడియా వచ్చింది. పిండి మధ్యలో నోటును పెట్టి కాల్చడంతో చివరకు ఏమైందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) తెగ వైరల్ అవుతోంది. పరోటాలు చేస్తున్న ఓ మహిళకు (woman) విచిత్రమైన ఐడియా వచ్చింది. పిండి మధ్యలో రూ.500నోటును పెట్టి కాల్చితే ఏమవుతుందో చూడాలని అనుకుంది. అనుకున్నట్లే పరోటా పిండి మధ్యలో నోటును ఉంచి పెనంపై వేస్తుంది. కొద్ది సేపు కాల్చిన తర్వాత కిందకు తీస్తుంది. లోపల నోటు ఏమైందో చూడాలని ఓపెన్ చేస్తుంది. అయితే పరోటా పొరలను (paratha) తీసి చూడగా.. అందులో ఆశ్చర్యకరంగా రూ.2000 నోటు ఉంటుంది.
చూశారా..! నా ప్రయోగం అన్నట్లుగా ఈ తంతును మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ఐడియాలు ఎలా వచ్చాయమ్మా మీకు’’.. అని కొందరు, ‘‘మ్యాజిక్ బాగానే చేశారు’’.. అని ఇంకొందరు, ‘‘నిజంగా ఇలా జరిగితే ఎంత బాగుంటుందో’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి..
Funny video: మీ ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందా.. అయితే ఇంటి నుంచి ఇలా ఈజీగా వెళ్లగొట్టండి..