Viral Video: ఈ బుడ్డోడు భలే తెలివైనోడు.. వెనుక కూర్చున్న తమ్ముడు పొరపాటున కింద పడిపోతాడేమోనని..!

ABN , First Publish Date - 2023-07-14T15:23:49+05:30 IST

చాలా మంది చిన్న పిల్లలు ఆటపాటల్లో పడి.. చుట్టుపక్కల ఏం జరుగుతోందో కూడా పట్టించుకోరు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే కొందరు పిల్లలు మాత్రం తాము ఏ పని చేస్తున్నా.. ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తుంటారు. జరగబోయే..

Viral Video: ఈ బుడ్డోడు భలే తెలివైనోడు.. వెనుక కూర్చున్న తమ్ముడు పొరపాటున కింద పడిపోతాడేమోనని..!

చాలా మంది చిన్న పిల్లలు ఆటపాటల్లో పడి.. చుట్టుపక్కల ఏం జరుగుతోందో కూడా పట్టించుకోరు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే కొందరు పిల్లలు మాత్రం తాము ఏ పని చేస్తున్నా.. ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తుంటారు. జరగబోయే ప్రమాదాలను ముందే పసిగట్టి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకుంటుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. సైకిల్‌పై వెనుక కూర్చున్న తమ్ముడు ఎక్కడ ప్రమాదంలో పడతాడో అని ఓ బుడ్డోడు చేసిన పని చూసి నెటిజన్లు.. ‘‘వారెవ్వా.. ఏం తెలివరా బాబూ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో (Viral video) ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పదేళ్ల బుడ్డోడు తన తమ్ముడిని సైకిల్ (cycle) వెనుక కూర్చోబెట్టుకుని వెళ్తూ ఉంటాడు. సాధారణంగా పిల్లలు ఎవరైనా ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా సైకిల్ తొక్కడం, తరచూ ప్రమాదాల బారిన పడడం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బుడ్డోడు మాత్రం ఎంతో తెలివిగా వ్యవహరించాడు. తన తమ్ముడు ఎక్కడ కిందపడిపోతాడోనని ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు. కాళ్లు చక్రాల్లో ఇరుక్కోకుండా ఉండేందుకు.. రెండు కాళ్లను సైకిల్‪కి కట్టేశాడు. ఇలా జాగ్రత్తలు తీసుకుని సైకిల్‌పై తీసుకెళ్తున్న సమయంలో చుట్టు పక్కల వారంతా అతని తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయారు.

Viral Video: ఎక్కడి నుంచి వస్తాయి తల్లీ ఇలాంటి ఐడియాలు.. టూత్ పేస్ట్ డబ్బాను ఇలా కూడా వాడొచ్చా..!?

వారి పక్కనే వెళ్తున్న వాహదారుడు.. బాలుడి తెలివి చూసి వీడియో తీశాడు. ఇది గమనించిన బుడ్డోడు.. సిగ్గుపడుతూ తన తమ్ముడి కాళ్లకు కట్టిన తాడు కనిపించకుండా పుస్తకాన్ని అడ్డుపెడతాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘‘ఈ బుడ్డోడి తెలివితేటలు సూపర్’’.. అంటూ కొందరు, ‘‘ప్రతి తమ్ముడికీ ఇలాంటి అన్న ఉంటే ఎంత బాగుంటుంది’’.. అని మరికొందరు, ‘‘అన్నాదమ్ముల అనుబంధం అంటే ఇది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేలల్లో లైకులను సొంతం చేసుకుంది.

Viral: స్వర్గంలో అయిదేళ్లు ఉండి వచ్చా.. అక్కడంతా ఎలా ఉందంటే.. నివ్వెరపోయేలా చేస్తున్న ఓ మహిళ వీడియో..!

Updated Date - 2023-07-14T15:23:49+05:30 IST