Health Tips: ఈ బామ్మ వయసు వందేళ్లు.. ఉద్యోగానికీ వెళ్తోంది.. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ బామ్మ చెప్పిన చిట్కా ఏంటంటే..!

ABN , First Publish Date - 2023-07-13T16:45:11+05:30 IST

కాటికి కాళ్లు చాపే వయసులో కొందరు.. వింత వింత పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. మరికొందరు యువకులతో పోటీ పడుతూ పనులు చేస్తుంటారు. ఇలాంటి వారికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వృద్ధురాలు కూడా...

Health Tips: ఈ బామ్మ వయసు వందేళ్లు.. ఉద్యోగానికీ వెళ్తోంది.. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ బామ్మ చెప్పిన చిట్కా ఏంటంటే..!

కాటికి కాళ్లు చాపే వయసులో కొందరు.. వింత వింత పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. మరికొందరు యువకులతో పోటీ పడుతూ పనులు చేస్తుంటారు. ఇలాంటి వారికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వృద్ధురాలు కూడా ఈ కోవకే చెందుతుంది. వందేళ్ల వయసులోనూ ఓ బామ్మ ఉద్యోగానికి వెళ్తోంది. ఈ వయసులోనూ ఇంత ఆరోగ్యంగా ఉండడంపై ఆమె చెప్పిన చిట్కా ఏంటంటే..

యూఎస్‌లోని ఒహియో (Ohio) ప్రాంత పరిధి సిన్సినాటికి చెందిన జేన్ బర్న్స్ అనే వృద్ధురాలు ఇటీవలే (hundred years old woman) వందేళ్లు పూర్తి చేసుకుంది. అయినా ఈమె ఈ వయసులోనూ క్రాప్ట్స్ స్టోర్‌లో పార్ట్‌టైమ్ ఫాబ్రిక్ కట్టర్‌గా పని చేస్తోంది. ఈమె భర్త 1997లో మరణించడంతో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. భర్త మరణించిన కొన్ని నెలలకే ఆమె పనిలో చేరింది. 26 సంవత్సరాలుగా అక్కడే పని చేస్తోంది. ఈమె తన కెరీర్‌లో చాలా వరకు బుక్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే కొన్నేళ్ల తర్వాత ఆ జాబ్‌కు రాజీనామా చేసింది. ప్రస్తుతం చేస్తున్న పని తనకు ఎంతో నచ్చిందని, ఎంతో మంది సహోద్యోగులు తనకు సన్నిహితులుగా మారారని తెలిపింది.

Mother: నెటిజన్ల మనసును కట్టిపడేస్తున్న ఫొటో ఇది.. అప్పుడు.. ఇప్పుడు.. అంటూ ఓ మహిళ పెట్టిన ఫొటోను చూసి..!

జేన్ ఇటీవల టిక్‌టాక్‌లోనూ (Tiktok) వీడియోలు చేస్తూ అందరికీ సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు డాన్సులు చేస్తూ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. జూలై 26న ఈమె వందేళ్లు పూర్తి చేసుకుని 101 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. జేన్ బర్న్స్‌కు వందేళ్లు నిండిన సందర్భంగా ఇటీవలే సహోద్యోగులంతా కలిసి ఆమె పుట్టిన రోజు వేడుకలను (Birthday celebrations) ఘనంగా నిర్వహించారు. పనులు చేసే ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండడం వల్ల ఎలాంటి మానసిక ఒత్తిడి (mental stress) ఉండదని జేన్ బర్న్స్ తెలిపింది.

Viral Video: ఎక్కడి నుంచి వస్తాయి తల్లీ ఇలాంటి ఐడియాలు.. టూత్ పేస్ట్ డబ్బాను ఇలా కూడా వాడొచ్చా..!?

అలాగే ఇష్టమైన పనులు చేస్తూ నిత్యం బిజీగా ఉండడం వల్ల.. అనారోగ్య సమస్యలు దరిచేరవని, తద్వారా ఎక్కువ కాలం జీవించవచ్చని జేన్ చెబుతోంది. హార్వర్డ్ పరిశోధకులు (Harvard researchers) చేసిన అధ్యయనంలోనూ వృద్ధురాలు చెప్పిందే నిజమని తేలింది. సంతోషం ఇవ్వని ఉద్యోగాలు చేయడం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తుతుంటాయని పరిశోధకులు కనుగొన్నారు. ఇదిలావుండగా, కాటికి కాళ్లు చాపే ఈ వయసులో, ఇన్నేళ్లు బతకడమే గగనం అనుకుంటే.. వృద్ధురాలు ఆశ్చర్యకరంగా పని చేస్తుండడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఈ బామ్మ గ్రేట్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: దుండగుడు బ్యాగు లాక్కోవడంతో.. పోతేపోనీ అని వదిలేసిన మహిళ.. అయితే ఇలా జరుగుతుందని ఇద్దరూ ఊహించలేదు..

Updated Date - 2023-07-13T16:45:11+05:30 IST