Viral Video: ఇది మరీ దారుణం.. ఓ వైపు బైక్‌పై వెళ్తూ.. మరోవైపు అందరి ముందూ ఈ ప్రేమికులు చేస్తున్న పనులు చూడండి..

ABN , First Publish Date - 2023-01-18T19:06:41+05:30 IST

ప్రేమికులు చేసే పనులు.. ఒక్కోసారి చిత్రవిచిత్రంగా ఉంటాయి. పార్కుల్లో అందరి ముందూ కొందరు అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తూనే ఉంటాం. అయితే ఇటీవల కొంతమంది ప్రేమ జంట ప్రవర్తన మరీ దారుణంగా ఉంటోంది. వాహనాల్లో..

Viral Video: ఇది మరీ దారుణం.. ఓ వైపు బైక్‌పై వెళ్తూ.. మరోవైపు అందరి ముందూ ఈ ప్రేమికులు చేస్తున్న పనులు చూడండి..

ప్రేమికులు చేసే పనులు.. ఒక్కోసారి చిత్రవిచిత్రంగా ఉంటాయి. పార్కుల్లో అందరి ముందూ కొందరు అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తూనే ఉంటాం. అయితే ఇటీవల కొంతమంది ప్రేమ జంట ప్రవర్తన మరీ దారుణంగా ఉంటోంది. వాహనాల్లో ప్రయాణిస్తూనే కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటి వెకిలి చేష్టలు చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు గతంలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట బైక్‌పై వెళ్తూ.. మరోవైపు అందరి ముందూ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

నా ప్రేయసిని పెళ్లి చేసుకోవద్దంటూ.. ఎంగేజ్మెంట్‌లోనే వరుడికి ప్రియుడి వార్నింగ్.. నాలుగో రోజే షాకింగ్ ట్విస్ట్..!

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నో పరిధి హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట (lovers) బైకుపై వెళ్తే చేసిన రొమాన్స్ చూసి ప్రజలు మండిపడుతున్నారు. ఓ యువకుడు తన ప్రేయసి బైకుపై (bike) ఎదురురెదుగా కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తుంటాడు. ప్రధాన రహదారిపై వెళ్తూ అందరి ముందూ రొమాన్స్ (Romance) మొదలెడతారు. ఒకరినొకరు కౌగిలించుకుని, ముద్దులు పెట్టుకుంటూ అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించారు. వీరిని చూసిన చుట్టుపక్కల వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ర్త పట్టించుకోకవడంతో దూరంగా ఉంటున్న భార్య.. ఓ రోజు ఎవరూ లేని సమయంలో స్నేహితులతో కలిసి..

వెనుక వస్తున్న వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో (Social media) షేర్ చేశారు. వైరల్ అవడంతో విషయం పోలీసు ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. ఈ ప్రేమ జంటను పట్టుకునేందుకు రెండు బృందాలను రంగంలోకి దింపారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి.. ప్రేమికులను గుర్తించే పనిలో పడ్డారు. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా బుద్ధి చెప్పాంటూ కామెంట్లు పెడుతున్నారు.

అత్యాచారం చేసి, సిగరెట్‌తో కాల్చారంటూ మహిళ ఫిర్యాదు.. చివరకు మెడికల్ రిపోర్టులు చూసి షాకైన పోలీసులు.

Updated Date - 2023-01-23T19:11:58+05:30 IST