అత్యాచారం చేసి, సిగరెట్‌తో కాల్చారంటూ మహిళ ఫిర్యాదు.. చివరకు మెడికల్ రిపోర్టులు చూసి షాకైన పోలీసులు..

ABN , First Publish Date - 2023-01-18T18:28:21+05:30 IST

ఓ మహిళ పట్ల ముగ్గురు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. అత్యాచారం చేయడంతో పాటూ ప్రైవేట్ భాగాల వద్ద సిగరెట్‌తో కాల్చి చిత్రహింసలకు గురి చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు..

అత్యాచారం చేసి, సిగరెట్‌తో కాల్చారంటూ మహిళ ఫిర్యాదు.. చివరకు మెడికల్ రిపోర్టులు చూసి షాకైన పోలీసులు..
ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళ పట్ల ముగ్గురు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. అత్యాచారం చేయడంతో పాటూ ప్రైవేట్ భాగాల వద్ద సిగరెట్‌తో కాల్చి చిత్రహింసలకు గురి చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. అయితే ఈ కేసులో ఇటీవల మెడికల్ రిపోర్టుల్లో షాకింగ్ వాస్తవాలు బయటపడడంతో అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

వామ్మో.. ఈ కేసులో ఎన్ని ట్విస్టులో.. చనిపోయాడనుకున్న 18 ఏళ్ల ఈ కుర్రాడు ఎలా తిరిగొచ్చాడంటే..!

ముంబైలోని (Mumbai) కుర్లా ప్రాంతంలో 2022 నవంబర్‌లో జరిగిన అత్యాచారం కేసులో సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తనపై అత్యాచారం చేయడంతో పాటూ సిగరెట్‌తో కాల్చడం, పదునైన ఆయుధాలతో దాడి చేశారని.. స్థానిక ప్రాంగతానికి చెందిన ఓ మహిళ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోలు తీసి, పోలీసులను ఆశ్రయిస్తే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారని కూడా ఆరోపించింది. ఈ కేసు మహిళా కమిషన్ దృష్టికి వెళ్లడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

నా ప్రేయసిని పెళ్లి చేసుకోవద్దంటూ.. ఎంగేజ్మెంట్‌లోనే వరుడికి ప్రియుడి వార్నింగ్.. నాలుగో రోజే షాకింగ్ ట్విస్ట్..!

నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో 40రోజుల క్రితం ముగ్గురు నిందితుల్లో ఒకరైన బబ్లూ అలియాస్ మహ్మద్ యాకూబ్ సిద్ధిఖీని అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. అలాగే పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇటీవల షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మెడికల్ రిపోర్టులో.. ఎలాంటి అత్యాచారం జరగనట్లు వెల్లడైంది. డ్రగ్స్ సరఫరాలో తలెత్తిన వివాదం కారణంగా ప్రతీకారం తీర్చుకునేందుకే సదరు మహిళ ఇలా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెపై వివిధ సెక్షన్ల కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

భర్త పట్టించుకోకవడంతో దూరంగా ఉంటున్న భార్య.. ఓ రోజు ఎవరూ లేని సమయంలో స్నేహితులతో కలిసి..

Updated Date - 2023-01-18T18:28:30+05:30 IST