Viral Video: వామ్మో! ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బీభత్సం సృష్టించిన ఏనుగు.. గేదెను వెంటపడుతూ మధ్యలో ఏం చేసిందో చూడండి..

ABN , First Publish Date - 2023-03-12T18:36:58+05:30 IST

ఏనుగులకు కోపం వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద వృక్షాలను సైతం పెకలించి, పక్కన పడేస్తుంటాయి. ఆ సమయంలో వాటి దగ్గరికి వెళ్లడానికి కూడా ఏ జంతువూ సాహసించదు. కొన్నిసార్లు జనావాసాల్లోకి వచ్చే ఏనుగులు... అందరినీ..

Viral Video: వామ్మో! ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బీభత్సం సృష్టించిన ఏనుగు.. గేదెను వెంటపడుతూ మధ్యలో ఏం చేసిందో చూడండి..

ఏనుగులకు కోపం వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద వృక్షాలను సైతం పెకలించి, పక్కన పడేస్తుంటాయి. ఆ సమయంలో వాటి దగ్గరికి వెళ్లడానికి కూడా ఏ జంతువూ సాహసించదు. కొన్నిసార్లు జనావాసాల్లోకి వచ్చే ఏనుగులు... అందరినీ బెంబేలెత్తిస్తుంటాయి. ఈ క్రమంలో అప్పుడప్పుడూ ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంటుంది. ఏనుగు దాడికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గేదెను తరుముకుంటూ వెళ్లిన ఓ ఏనుగు.. ఆ కోపాన్ని పక్కన ఉన్న వారిపై చూపించబోయింది. చివరకు ఏమైందంటే..

సోషల్ మీడియాలో ఏనుగుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ (Elephant Viral videos) అవుతోంది. ఓ దుకాణం వద్ద జనం రద్దీగా ఉంటారు. అంతలో మరో వైపు నుంచి కొందరు పరుగెత్తుకుంటూ వస్తారు. వామ్మో! ఏనుగు అని అరుస్తూ రావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. అంతలో ఓ గేదె పరుగెత్తుకుంటూ వెళ్తుంది. దాన్ని వెంబడిస్తూ వచ్చిన ఏనుగు.. షాపు వద్దకు రాగానే రూటు మార్చుకుంటుంది. గేదెను వదిలేసి, ఆ కోపాన్ని పక్కన ఉన్న వారిపై చూపించాలని అనుకుంటుంది. అప్పటికే అక్కడున్న వారంతా షాపు వద్ద భయం భయంగా వణుకుతూ ఉంటారు.

భర్తపై నమోదైన వేధింపుల కేసును.. వెంటనే ఎత్తేయాలంటూ టవర్ ఎక్కిన భార్య.. చివరకు ఆమె చెప్పింది విని అంతా షాక్..

ఓ వ్యక్తి తన అక్కడున్న స్కూటీని పక్కకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు. అయితే అప్పటికే ఏనుగు దగ్గరికి రావడం చూసి.. చచ్చాన్రో దేవుడో! అనుకుంటూ స్కూటీని వదలేసి పక్కకు పారిపోతాడు. కోపంతో అక్కడికి వచ్చిన ఏనుగు.. తొండంతో స్కూటీని పక్కకు నెట్టేస్తుంది. అప్పటికి కోపం తగ్గిందో ఏమో గానీ.. షాపు వద్ద ఉన్న వారిని ఏమీ అనకుండా పక్కకు వెళ్లిపోతుంది. దీంతో అంతా హమ్మయ్య! అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియో మిలియన్ వ్యూస్‌కు (Million views) పైగా సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Digital Payments in Wedding: పెళ్లి వేడుకలో QR Code బోర్డ్.. స్కాన్ చేసి ఓ బంధువు ఎంత పంపించాడో తెలిసి అవాక్కైన వధూవరులు..!

Updated Date - 2023-03-12T18:36:58+05:30 IST