Viral Video: గుట్కా పైన ఎంత ప్రేమ ఉంటే మాత్రం.. మరీ డ్యాన్స్‌లో కూడా చూపించడమేంట్రా బాబూ..

ABN , First Publish Date - 2023-01-03T21:26:56+05:30 IST

కొందరు యువకులు చేసే విన్యాసాలు, డ్యాన్సులు చూడటానికి విచిత్రంగా ఉంటాయి. నాగిని డ్యాన్స్, గంగ్నం స్టైల్ తదితర డ్యాన్స్ వీడియోలు ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు. ప్రస్తుతం ఓ వ్యక్తి వేసిన గుట్కా డ్యాన్స్ వీడియో..

Viral Video: గుట్కా పైన ఎంత ప్రేమ ఉంటే మాత్రం.. మరీ డ్యాన్స్‌లో కూడా చూపించడమేంట్రా బాబూ..

కొందరు యువకులు చేసే విన్యాసాలు, డ్యాన్సులు చూడటానికి విచిత్రంగా ఉంటాయి. నాగిని డ్యాన్స్, గంగ్నం స్టైల్ తదితర డ్యాన్స్ వీడియోలు ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు. ప్రస్తుతం ఓ వ్యక్తి వేసిన గుట్కా డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. గుట్కా పైన ఎంత ప్రేమ ఉంటే మాత్రం.. మరీ ఇలా డ్యాన్స్ వేస్తూ చూపించడం ఏంట్రా బాబూ.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఉద్యోగం మానేయడం లేదని భార్యకు తలాక్ చెప్పిన భర్త.. ఆడవాళ్లకు జాబ్ చేసే హక్కు లేదంటూ..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ యువకుడు వివాహ వేడుకలో (Wedding ceremonies) వేసిన గుట్కా డ్యాన్స్ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. డీజే పాటలకు (DJ songs) కొందరు యువకులు సమూహంగా డ్యాన్స్ చేస్తుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం వారి వెనుక వినూత్నంగా డ్యాన్స్ వేస్తాడు. చేతిలో గుట్కా నలుపుకొని, తర్వాత దాన్ని నోట్లో పెట్టుకున్నట్లుగా నటిస్తూ డ్యాన్స్ చేస్తాడు. అనంతరం పక్కనున్న యువకులతో కలిసి డ్యాన్స్ చేస్తాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న యువకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

మందు పార్టీ చేసుకున్న మామా, అల్లుళ్లు.. నిద్రపోయి లేచిన మామ.. ఉన్నట్టుండి తన భార్య కనపడకపోవడంతో..

Updated Date - 2023-01-04T00:13:23+05:30 IST