ఉద్యోగం మానేయడం లేదని భార్యకు తలాక్ చెప్పిన భర్త.. ఆడవాళ్లకు జాబ్ చేసే హక్కు లేదంటూ..

ABN , First Publish Date - 2023-01-03T20:45:35+05:30 IST

ఉద్యోగం చేయడమే ఆమె పాలిట శాపమైంది. భార్యకు అన్ని విధాలా అండగా ఉండాల్సిన భర్త.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ఉద్యోగం మానేయాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చాడు. మందలించాల్సిన తల్లిదండ్రులు కూడా కొడుకుకే మద్దతు ఇచ్చారు. ఎంత చెప్పినా..

ఉద్యోగం మానేయడం లేదని భార్యకు తలాక్ చెప్పిన భర్త.. ఆడవాళ్లకు జాబ్ చేసే హక్కు లేదంటూ..
ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగం చేయడమే ఆమె పాలిట శాపమైంది. భార్యకు అన్ని విధాలా అండగా ఉండాల్సిన భర్త.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ఉద్యోగం మానేయాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చాడు. మందలించాల్సిన తల్లిదండ్రులు కూడా కొడుకుకే మద్దతు ఇచ్చారు. ఎంత చెప్పినా ఉద్యోగం మానేయలేదనే కోపంతో.. ఆడవాళ్లకు జాబ్ చేసే హక్కు లేదంటూ.. ఇటీవల భార్యకు తలాక్ చెప్పి ఇంటి నుంచి గెంటేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

వింత సంఘటన.. మూడు కళ్లతో పుట్టిన లేగదూడ.. చూసేందుకు తరలివస్తున్న జనం.. డాక్టర్లు ఏం తేల్చారంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్ పరిధి ఖజ్రానా ప్రాంతనికి చెందిన అద్నాన్ అనే యువకుడికి నజ్నీన్ ఖాన్ అనే యువతితో 2022 మార్చిలో వివాహమైంది. నజ్నీన్ ఖాన్ స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా (Assistant Manager) పని చేస్తోంది. అయితే నజ్నీన్ ఉద్యోగం చేయడం భర్తతో పాటూ అత్తమామలకు కూడా నచ్చలేదు. ఇదిలావుండగా, రెండు నెలల క్రితం నజ్నీన్‌కు.. ముంబైలో ఉంటున్న ఆమె భర్త సోదరి ఫోన్ చేసింది. మన ఇళ్లల్లో మహిళలు ఉద్యోగాలు చేయడం సరైంది కాదు. వెంటనే ఉద్యోగం మానేయాలని చెప్పింది. అయితే తనకు ఏప్రిల్‌లో మేనేజర్‌గా పదోన్నతి లభించనుందని, ఈ సమయంలో ఇలా ఉద్యోగం మానేయడం కుదరదని చెప్పింది. దీంతో నజ్నీన్‍‌పై కోపం పెంచుకున్న ఆమె.. తన సోదరుడు అద్నాన్‌కు ఫోన్ చేసి, నజ్నీన్‍‌పై వివిధ రకాలుగా చాడీలు చెప్పడం ప్రారంభించింది. అప్పటికే భార్యపై అసహనంగా ఉన్న అద్నాన్.. అప్పటి నుంచి మరింత కోపం పెంచుకున్నాడు.

ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు.. భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీగా ఉండడంతో.. ఇంటికి వెళ్లి చూసేసరికి..

ఉద్యోగం మానేయాల్సిందేనని ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆఫీసుకు తీసుకెళ్లడం కూడా మానేశాడు. అయినా నజ్నీన్ ఎలాగోలా వెళ్లి, వస్తూ ఉండేది. ఇలావుండగా, ఇటీవల నజ్నీన్ అత్త కూడా వేధించడం (Harassment) మొదలెట్టింది. ఉదయం లేవగానే కావాలనే వివిధ రకాల పనులు చెబుతూ, ఉద్యోగానికి ఆలస్యం అయ్యేలా చేసేది. ఇటీవల గొడవలు మరింత పెరిగిపోయాయి. నవంబర్‌లో భార్యపై దాడి చేసిన అద్నాన్.. ఆడవాళ్లకు జాబ్ చేసే హక్కు లేదంటూ, ట్రిపుల్ తలాక్ (Triple Talaq) చెబుతూ ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో పుట్టింటికి వెళ్లిన నజ్నీన్.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ క్రమంలో పలుమార్లు పంచాయితీలు పెట్టినా అద్నాన్ మాత్రం.. భార్యను తీసుకెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మందు పార్టీ చేసుకున్న మామా, అల్లుళ్లు.. నిద్రపోయి లేచిన మామ.. ఉన్నట్టుండి తన భార్య కనపడకపోవడంతో..

Updated Date - 2023-01-03T20:45:39+05:30 IST