చోరీ చేసేందుకు వచ్చి.. సీసీ కెమెరా ఎదురుగా పిచ్చి చేష్టలు.. వైరల్ అవుతున్న దొంగ నిర్వాకం..

ABN , First Publish Date - 2023-01-06T16:20:57+05:30 IST

సోషల్ మీడియాలో చోరీలకు సంబంధించిన పలు వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. చోరీలు, దోపిడీలు జరిగే సమయంలో కొన్నిసార్లు విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం ఓ దొంగ చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు.. తెగ చక్కర్లు..

చోరీ చేసేందుకు వచ్చి.. సీసీ కెమెరా ఎదురుగా పిచ్చి చేష్టలు.. వైరల్ అవుతున్న దొంగ నిర్వాకం..

సోషల్ మీడియాలో చోరీలకు సంబంధించిన పలు వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. చోరీలు, దోపిడీలు జరిగే సమయంలో కొన్నిసార్లు విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం ఓ దొంగ చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు.. తెగ చక్కర్లు (Viral photos and videos) కొడుతున్నాయి. చోరీ చేసేందుకు వచ్చిన దొంగ.. సడన్‌గా పిచ్చి పట్టినట్లు బ్రేక్ డాన్సులు వేశాడు. దీన్ని చూసిన నెటిజన్లు.. వీడు కామెడీ దొంగలా ఉన్నట్టున్నాడే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఆయనో డాక్టర్.. ఆమె ఓ ప్రొఫెసర్.. భార్యాభర్తలిద్దరూ జాబ్స్‌కు రిజైన్ చేసి ఆవుల పెంపకం.. ఎందుకీ నిర్ణయం అని అడిగితే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) శివపురి జిల్లా ఖనియాంధన పరిధి గూడార్ రోడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ టైల్స్ దుకాణంలోకి (Tiles shop) ఇటీవల రాత్రి ఓ దొంగ ప్రవేశించాడు. వచ్చిన కొద్ది సేపటికి ఏదో తింటూ ఉన్నట్టుండి పూనకం వచ్చిన వాడిలా బ్రేక్ డాన్సులు చేస్తాడు. కొద్ది సేపు అలా స్టెప్పులు వేసి, తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తాడు. తర్వాత సీసీ కెమెరా వైపు చూస్తూ.. నా ఫెర్ఫార్మెన్స్ బాగుందా.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. తర్వాత షాపులోని రెండు ల్యాప్‌టాప్‌లతో (laptop) పాటూ నగదు (cash), ఇతర కాగితాలనూ ఎత్తుకెళ్లాడు.

సీసీ కెమెరాలను గమనించని పోలీసులు.. నడి రోడ్డుపై కారు ఆపి మరీ ఏం చేశారంటే..

దుకాణ యజమాని మాట్లాడుతూ.. రెండు దుకాణాల్లో లక్షల విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు తెలిపాడు. స్థానిక ప్రాంతాల్లో దొంగతనాలు తరచూ జరుగుతున్నా.. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని కోరుతున్నారు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఎప్పటికైనా నీ భార్యను పెళ్లి చేసుకుంటానంటూ హెచ్చరించిన యువకుడు.. అయినా పట్టించుకోని భర్త.. ఓ రోజు అనుకోకుండా..

Updated Date - 2023-01-06T16:21:05+05:30 IST