Viral Video: పెళ్లి పీటలపై ఉండాల్సిన అమ్మాయి మెట్రో రైల్లో ప్రత్యక్ష్యం.. అసలేం జరిగిందో తెలిసి అవాక్కవుతున్న నెటిజన్లు..!

ABN , First Publish Date - 2023-01-19T17:45:34+05:30 IST

పెళ్లి మంటపాల్లోకి వధూవరుల ఎంట్రీకి సంబంధించిన వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సాధారణానికి భిన్నంగా ట్రాక్టర్, లగేజ్ ట్రాలీ, బైకు ఇలా.. వివిధ రకాలుగా వధూవరులు వివాహ వేదిక వద్దకు వచ్చి..

Viral Video: పెళ్లి పీటలపై ఉండాల్సిన అమ్మాయి మెట్రో రైల్లో ప్రత్యక్ష్యం.. అసలేం జరిగిందో తెలిసి అవాక్కవుతున్న నెటిజన్లు..!

పెళ్లి మంటపాల్లోకి వధూవరుల ఎంట్రీకి సంబంధించిన వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సాధారణానికి భిన్నంగా ట్రాక్టర్, లగేజ్ ట్రాలీ, బైకు ఇలా.. వివిధ రకాలుగా వధూవరులు వివాహ వేదిక వద్దకు వచ్చి, అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లి పీటలపై ఉండాల్సిన అమ్మాయి.. మెట్రో రైల్లో ప్రత్యక్షమైంది. చివరకు అసలు ఏం జరిగిందో తెలుసుకుని.. నెటిజన్లు అవాక్కవుతున్నారు.

Viral Video: ఇది మరీ దారుణం.. ఓ వైపు బైక్‌పై వెళ్తూ.. మరోవైపు అందరి ముందూ ఈ ప్రేమికులు చేస్తున్న పనులు చూడండి..

సోషల్ మీడియాలో బెంగళూరుకు చెందిన ఓ వధువుకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ (Bride viral videos) అవుతోంది. వధువు పెళ్లి మంటపానికి కారులో వెళ్తుండగా బెంగళూరులో (Bangalore) ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు మూహూర్తానికి సమయం ఆసన్నమవుతోంది. దీంతో వధువు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కారు దిగి నేరుగా మెట్రో స్టేషన్‌కు (Metro station) చేరుకుంది. మెట్రో రైలు ఎక్కి పెళ్లి మంటపానికి చేరుకుంది. బంగారు ఆభరణాలు ధరించి, పెళ్లి దుస్తుల్లో మెట్రో రైల్లో (Metro train) కనిపించిన యువతిని.. అంతా ఆసక్తిగా గమనించారు. చివరకు అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది.. అంటూ కొందరు, వధువు సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంది.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఫొటో తీసుకునేందుకు వందే భారత్ ట్రైన్ ఎక్కాడు.. తర్వాత ఏమైందంటే..

Updated Date - 2023-01-19T17:45:40+05:30 IST