Shocking Video: సడెన్‌గా బద్దలైన వాటర్ పైప్‌లైన్.. నీటి ఉధృతికి ఒక్కసారిగా రెండుగా చీలిపోయిన రోడ్డు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం..!
ABN , First Publish Date - 2023-03-05T12:39:04+05:30 IST
మహారాష్ట్రలో (Maharastra) తాజాగా ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఒకటి చోటు చేసుకుంది.
Viral Video: మహారాష్ట్రలో (Maharastra) తాజాగా ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇంగ్లీష్ సినిమాల్లో చూపించినట్లు ఉన్నట్టుండి ఒక్కసారిగా రోడ్డు రెండుగా చీలిపోయింది. దాని తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని యావత్ మాల్ (yavatmal) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉన్నట్టుండి వాటర్ పైప్‌లైన్ (Water Pipeline Bursts) ఒక్కసారిగా బద్దలవ్వడంతో ఆ నీటి ఉధృతికి రోడ్డు రెండుగా చీలిపోయింది. దాంతో కొద్దిసేపు నీరు (Water) భారీగా ఎగసిపడింది. క్షణాలలో ఆ రోడ్డంతా జలమయమైంది. ఇక ఊహించని ఈ ఘటనతో అదే సమయంలో ఆ రోడ్డుపై స్కూటీ తీసుకుని వెళ్తున్న ఓ మహిళ గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఇప్పుడీ ఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వీడియోలోని దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: అదానీ షేర్ల దూకుడుతో ఆ ఎన్నారై పంటపడింది.. రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 3,100 కోట్ల లాభం..!