Viral Video: ఇద్దరు మహిళలు పంతానికి పోతే ఇలాగే ఉంటుందేమో.. సీట్లోంచి ఆమె లేవకపోవడంతో పక్కకు నెట్టి మరీ కూర్చుంది.. చివరకు..!

ABN , First Publish Date - 2023-04-16T13:52:17+05:30 IST

మనం బస్ జర్నీలు చేస్తున్నప్పుడు సాధారణంగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి.

Viral Video: ఇద్దరు మహిళలు పంతానికి పోతే ఇలాగే ఉంటుందేమో.. సీట్లోంచి ఆమె లేవకపోవడంతో పక్కకు నెట్టి మరీ కూర్చుంది.. చివరకు..!

Viral Video: మనం బస్ జర్నీలు చేస్తున్నప్పుడు సాధారణంగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో ప్రధానంగా బస్సులో సీటు కోసం ఇద్దరు వ్యక్తులు ఘర్షణకు దిగడం. ఈ గొడవలు చూడడానికి చాలా సిల్లీగా ఉంటాయి కూడా. కానీ, ఒక్కొసారి ఈ సిల్లీ గొడవలే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంటాయి. ఇలాంటి సీటు గొడవ కాస్త ఇద్దరు మహిళల మధ్య జరిగితే ఎలా ఉంటది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో డీటీసీ బస్‌లో (Delhi DTC bus) ఇద్దరు మహిళలు సీటు కోసం తగువులాడారు. దానికి తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దాదాపు 4 నిమిషాల నిడివి గల ఈ వీడియోను సుమతీ చౌదరీ అనే ఫేస్ యూజర్ పోస్ట్ చేశారు. దాంతో వీడియో వైరల్‌గా (Viral Video) మారింది. 8లక్షలకు పైగా వ్యూస్, 9.2వేల లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు ఇద్దరు మహిళలు పంతానికి పోతే ఇలాగే ఉంటుందేమో అని వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. బస్సులో ఓ సీటుపై ఓ వ్యక్తి, అతడి పక్కన మరో మహిళ కూర్చొని ఉండడం మనం చూడొచ్చు. అంతలో మరో మహిళ అక్కడికి వచ్చి సీటులో కూర్చున్న వ్యక్తిని లేవాలని అడుగుతుంది. కానీ, అతని పక్కన కూర్చుకున్న మహిళ మాత్రం ఆయన లేవడని చెబుతుంది. అలా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. చాలాసేపు ఘర్షణ పడ్డాక నిలబడి ఉన్న మహిళ ఇలా అయితే కాదని, సీటులో కూర్చున్న మహిళను పక్కకు నెట్టి మరీ కూర్చుంది. అంతే.. వారిద్దరి మధ్య గొడవ ఇంకా గట్టిగా అయింది. అలా వారు గొడవ పడుతుంటే బస్సులోని కొందరు ప్రయాణికులు సర్ది చెప్పి.. కూర్చున్న వ్యక్తిని లేపేయడం జరిగింది. దాంతో ఈ గొడవ సద్దుమణిగింది. ఈ దృశ్యాలను మరో మహిళ వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టింది. అంతే.. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

Highest Paid Government Jobs: అల్లాటప్పా ప్రభుత్వోద్యోగాలు కాదండోయ్.. ఈ పది జాబ్స్‌లో ఒక్కటి కొట్టినా చాలు..!


Updated Date - 2023-04-16T13:52:17+05:30 IST