Treadmill vs Walking: ట్రెడ్‌మిల్ వాకింగ్ మంచిదా? లేక బయట నడవడం మంచిదా? బరువు తగ్గడానికి ఏది బెస్టంటే..

ABN , First Publish Date - 2023-10-12T11:38:15+05:30 IST

బయటకు వెళ్లి నడవడానికి సౌకర్యం లేకపోతే జిమ్ లోనూ, ఇంట్లోనూ ట్రెడ్ మిల్ మీద వాకింగ్ చేస్తుంటారు. కానీ..

 Treadmill vs Walking: ట్రెడ్‌మిల్ వాకింగ్ మంచిదా? లేక బయట నడవడం మంచిదా? బరువు తగ్గడానికి ఏది బెస్టంటే..

నడక చాలా సులువైన వ్యాయామం. దీనికి ఎలాంటి పరికరాలు అక్కర్లేదు. కాస్త విశాలమైన స్థలం ఉంటే చాలు ఎంచక్కా నడిచేయొచ్చు. కానీ టెక్నాలజీ కారణంగా నడకకు ఒక ప్రత్యామ్నాయ మార్గం దొరికింది. అదే ట్రెడ్‌మిల్. ట్రెడ్‌మిల్ మీద వాకింగ్ మాత్రమే కాదు, రన్నింగ్, జాకింగ్ కూడా చేయవచ్చు. కానీ ట్రెడ్‌మిల్ మీద నడకకు, బయట నడవడానికి తేడా ఉందా? దేనివల్ల ఎక్కువ లాభాలుంటాయి? పూర్తీగా తెలుసుకుంటే..

జిమ్ కు వెళ్లేవారు, ఇంట్లో వాకింగ్ చేయాలని అనుకునేవారు ట్రెడ్‌మిల్ మీద వాకింగ్(Treadmill Walking) చేస్తుంటారు. ట్రెడ్‌మిల్ మీద వాకింగ్ చేసేటప్పుడు గాలి పీడనం ముందునుండి ఉండదు. ఈ కారణంగా ట్రెడ్‌మిల్ మీద వాకింగ్ చేసేటప్పుడు శరీరం తేలికగా అనిపిస్తుంది. వాకింగ్ చేసినా, రన్నింగ్ చేసినా పెద్ద కష్టపడుతున్నట్టు అనిపించదు. ట్రెడ్‌మిల్ వేగం ఎంత ఉంటే అంత తేలిక. కానీ బయట ప్రాంతంలో నడుస్తున్నప్పుడు(out door walking) గాలి పీడనం శరీరానికి ముందు నుండి ఉంటుంది. ఈ పీడనాన్ని ఎదుర్కొంటూ వాకింగ్ చేయడం లేదా రన్నింగ్ చేయడం కష్టంతో కూడుకుని ఉంటుంది.

Bus seats: పబ్లిక్ బస్ సీట్లు ముదురురంగులో ఎందుకుంటాయనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? ఓ వ్యక్తి సుత్తితో సీటుమీద కొడితే ఏం జరిగిందో చూస్తే..



ట్రెడ్‌మిల్ వాకింగ్ అయినా, సాధారణ వాకింగ్ అయినా రెండూ గుండెకు మంచి చేసేవే.. రెండు విధానాలలోనూ పీల్చుకునే ఆక్సిజన్, అది శరీరంలో కలిగించే శక్తి సమానంగానే ఉంటాయి. కానీ బరువు తగ్గాలని అనుకునేవారికి ట్రెడ్‌మిల్ కంటే బయట వాకింగ్ చేయడం మంచిది. బయట వాకింగ్, రన్నింగ్ చేసేవారు ట్రెడ్‌మిల్ కంటే 5శాతం ఎక్కువ కేలరీలను బర్న్ చేయగలుగుతారు. అందుకే బరువు తగ్గాలని అనుకునేవారు బయట వాకింగ్ చేయడం మంచిది.

ఎముకలు, కీళ్ళ ఆరోగ్యానికి ట్రెడ్‌మిల్ ఉత్తమమని చెబుతున్నారు. ట్రెడ్‌మిల్ లో వాకింగ్ చేసేటప్పుడు కీళ్ళు ఓ లెవల్ లో పనిచేస్తాయి, ఇది కీళ్ళకు చిన్న షాక్ ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది. పైపెచ్చు ట్రెడ్‌మిల్ సర్పేస్ ఒకే విదంగా ఉంటుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ బయట నడిచేటప్పుడు ఒత్తిడి కీళ్ల మీద, చీలమండల మీద పడుతుంది. అలాంటప్పుడు కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Viral: ప్రపంచంలో రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం.. ఎక్కడో తెలిస్తే షాకవుతారు..


Updated Date - 2023-10-12T11:38:15+05:30 IST