Bus seats: పబ్లిక్ బస్ సీట్లు ముదురురంగులో ఎందుకుంటాయనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? ఓ వ్యక్తి సుత్తితో సీటుమీద కొడితే ఏం జరిగిందో చూస్తే..

ABN , First Publish Date - 2023-10-11T10:24:22+05:30 IST

ప్రయాణాలు అనగానే అధికశాతం మంది పబ్లిక్ బస్సులనే ఎంచుకుంటారు. కానీ ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.

 Bus seats: పబ్లిక్ బస్ సీట్లు ముదురురంగులో ఎందుకుంటాయనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? ఓ వ్యక్తి సుత్తితో సీటుమీద కొడితే ఏం జరిగిందో చూస్తే..

అధికశాతం ప్రజలు పబ్లిక్ బస్సులలో ప్రయాణిస్తుంటారు. గ్రామాల నుండి సిటీ బస్సుల వరకు పబ్లిక్ బస్సులే అధికంగా ఉంటాయి. పబ్లిక్ బస్సులు ఎక్కగానే సీటు దొరికితే చాలురా దేవుడా అనుకునేవారే కానీ, సీట్ల రంగు గమనించేవారు బహుశా తక్కువే. కానీ ఈ సీట్లకు సంబంధించి షాకింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చెక్క సుత్తి తీసుకుని పబ్లిక్ బస్సు సీటు మీద కొట్టగానే జరిగింది చూసి నెటిజన్లు కూడా షాకవుతున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ప్రయాణాలు అనగానే అధికశాతం మంది పబ్లిక్ బస్సులనే(public bus) ఎంచుకుంటారు. సీటు కోసం కర్చీఫ్ వేసేవారు అధికంగా ఉంటారు. ఇలాంటి వారు బస్సు ఎక్కి సీటును చేత్తోనో కర్చీఫ్ తోనో శుభ్రం చేసుకుని కూర్చుంటారు. అయితే ఈ సీట్లు కళ్ళతో చూసినంత శుభ్రంగా ఏమీ ఉండవని ఈ వీడియో నిరూపిస్తోంది. వీడియోలో పబ్లిక్ బస్సులో ఒక సీటును(public bus seat) మొదటగా చూపిస్తారు. ఆ తరువాత ఓ వ్యక్తి ఒక సుత్తి తీసుకుని దాంతో సీటుమీద కొట్టడం మొదలుపెడతాడు. అతనలా కొడుతుంటే దెబ్బ దెబ్బకు ఆ సీటు లోపలినుండి పెద్ద మొత్తంలో దుమ్ము బయటకు వస్తుంది. వీడియో ముగిసేలోపు అందులోనుంచి బయటకు వచ్చిన దుమ్ము మొత్తాన్ని చూస్తే దిమ్మతిరిగిపోతుంది. ప్రతిరోజూ బస్సులలో ప్రయాణించేవారు ఈ వీడియో చూసి షాకవుతున్నారు. బస్సు సీట్లలో అంత దుమ్ము ఉన్నా అవి శుభ్రంగా కనిపించడం వెనుక కారణం సీట్లకోసం ఉపయోగించే ఫ్యాబ్రిక్. సీట్లకోసం ఉపయోగించే ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్ సీట్లమీద దుమ్ము, ధూళి, మరకలు మొదలైనవాటిని కవర్ చేసేలా ఉంటుంది.

Health Tips: వంటింట్లో ఉండే పెసరపప్పును అంతగా పట్టించుకోరు కానీ.. వీటిని రోజూ నానబెట్టి తింటే జరిగేది ఇదే..


ఈ వీడియోను _likealeaf అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. దీని గురించి పలువిధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'సీట్లకు కుషన్ ఉండటం వల్ల వస్తున్న సమస్య అది. దయచేసి కుషన్ లేకపోయినా పర్వాలేదు ప్లాస్టిక్ సీట్లు పెట్టండి' అని ఒకరు కామెంట్ చేశారు. 'అందరూ అలాంటి సీట్లపై కూర్చుని, ఆ సీట్లను చేతులతో తాకి, ఇంటికెళ్లి ఇంట్లో కూడా కూర్చుంటారు. అదెంతవరకు ఆరోగ్యకరం' అని మరొకరు కామెంట్ చేశారు. 'బస్సులలో ప్రయాణించి ఇంటికెళ్లగానే ప్రతి ఒక్కరూ దుస్తులు మార్చుకోవడం ఉత్తమం. లేకపోతే అది చాలా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది' అని ఇంకొకరు కామెంట్ చేశారు.

Tea: చల్లగా అయిపోయిన తరువాత టీ ని మళ్లీ వేడి చేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే..


Updated Date - 2023-10-11T10:24:22+05:30 IST