Shocking Twist: ఓ మహిళ కంటి కింద ఎర్రటి మచ్చ.. ఎన్నేళ్లయినా ఎందుకు తగ్గడం లేదని డాక్టర్లు పరిశోధన చేస్తే.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2023-05-03T15:58:44+05:30 IST

తాజాగా వెలుగు చూసిన ఓ రోగం వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇంతకీ ఆ కొత్త రోగమేంటి? అదెలా బయటపడిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

Shocking Twist: ఓ మహిళ కంటి కింద ఎర్రటి మచ్చ.. ఎన్నేళ్లయినా ఎందుకు తగ్గడం లేదని డాక్టర్లు పరిశోధన చేస్తే.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!
Shocking Twist

మనిషన్నాక రోగాలొస్తుంటాయి.. పోతుంటాయి. ఒకప్పుడు వైద్యశాస్త్రం అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. ఇప్పుడు వైద్యశాస్త్రం అభివృద్ధి చెందింది. మనిషి రోగాన్ని కనిపెట్టే టెక్నాలజీ రావడంతో పాటు చికిత్స కూడా అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా నిరంతరం వైద్య నిపుణులు కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటున్నారు. అలానే జబ్బులు కూడా కొత్తవి కూడా పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా వెలుగు చూసిన ఓ రోగం వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇంతకీ ఆ కొత్త రోగమేంటి? అదెలా బయటపడిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

సహజంగా చర్మంపై అనేక మచ్చలు, మొటిమలు వస్తుంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోం. లైట్ తీసుకుంటారు. అవే పోతాయిలే అనుకుంటారు. ఇక్కడే పప్పులు కాలేస్తుంటారు. ఒక్కోసారి కర్రే పామై కరుస్తోంది అంటారు. అంటే చిన్న చిన్న విషయాలే కొన్నిసార్లు కొంపముంచుతాయి. అందుకే ఏదైనా నష్టం జరగక ముందే జాగ్రత్త పడితే మంచిదంటారు పెద్దలు.

అమెరికా (America)లోని చర్మవ్యాధి నిపుణులు ప్రపంచంలోనే అతి చిన్న చర్మ క్యాన్సర్‌ (Skin Cancer)ను గుర్తించారు. దీని పరిమాణం కేవలం 0.65 మి.మీలు కావడం విశేషం. కన్ను కింద ఎర్రని మచ్చతో చాలా ఏళ్లుగా ఓ మహిళ బాధపడుతోంది. ఆమె ఒరెగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్సిటీ చర్మవ్యాధుల నిపుణులను సంప్రదించింది. వారు మహిళ కంటి కింద నున్న ఎర్రని మచ్చను పరిశీలిస్తుండగా అదే కుడి చెంపపై మరొక మచ్చను గుర్తించారు. కంటికి దాదాపు కనిపించని ఆ చిన్న మచ్చ తదనంతరం మెలనోమా (Melanoma)గా తేలింది. ఇది ప్రాణాంతకమైన చర్మ క్యాన్సర్‌ రకంగా వైద్యులు (American medical experts) తేల్చారు.

ఈ క్యాన్సర్‌ను గుర్తించిన ఓహెచ్‌ఎస్‌యూ డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.అలెగ్జాండర్ విట్కోవ్‌స్కీ మాట్లాడారు. ఈ మైక్రో- మెలనోమాను చర్మం పైపొరపై గుర్తించినట్లు తెలిపారు. క్యాన్సర్‌ కణాలు ఆ మచ్చ వరకే పరిమితం అయ్యాయని.. ఇంకా వ్యాప్తి చెందలేదన్నారు. శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించడానికి ముందే దాన్ని కనుగొనడంతో చికిత్స సాధ్యమైందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు అమెరికా ప్రభుత్వ ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. జనవరిలోనే ఈ మచ్చను గుర్తించగా దీనికి తాజాగా వరల్డ్ గిన్నిస్ రికార్డు సైతం దక్కినట్లు ఓహెచ్‌ఎస్‌యూ తెలిపింది.

ఇది కూడా చదవండి: Bride: కలలో కూడా ఊహించని ఘటన.. పెళ్లయిన 5 గంటలకే వధువు మృతి.. వరుడు పక్కన ఉండగానే..!

Updated Date - 2023-05-03T15:58:44+05:30 IST