Bride: కలలో కూడా ఊహించని ఘటన.. పెళ్లయిన 5 గంటలకే వధువు మృతి.. వరుడు పక్కన ఉండగానే..!

ABN , First Publish Date - 2023-05-03T12:53:04+05:30 IST

ఎన్నో ఊహించుకుంటూ.. ఏవేవో కలలు కంటూ సంసారం జీవితంలోకి అడుగుపెట్టే సమయానికి అంతలోనే విధికి కన్ను కుట్టింది. వారి ఆశలన్నీ భంగమైపోయాయి. ఊహించని

Bride: కలలో కూడా ఊహించని ఘటన.. పెళ్లయిన 5 గంటలకే వధువు మృతి.. వరుడు పక్కన ఉండగానే..!
Bride

వారిద్దరూ కొత్త జంట. చూడముచ్చటైన కఫుల్స్. పెళ్లి అనే బంధం చేత వారిద్దరూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. బంధువులు, స్నేహితుల రాకతో ఆ కొత్త జంట ఆనందానికి అవధులు లేవు. అందరితో కలిసి డ్యాన్స్‌లు వేశారు. సందడి.. సందడిగా గడిపారు. ఆ సంతోషాలన్నీ కళ్ల ముందు ఇంకా మెదులాడుతూనే ఉన్నాయి. ఎన్నో ఊహించుకుంటూ.. ఏవేవో కలలు కంటూ సంసారం జీవితంలోకి అడుగుపెట్టే సమయానికి అంతలోనే విధికి కన్ను కుట్టింది. వారి ఆశలన్నీ భంగమైపోయాయి. ఊహించని ప్రమాదం వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నారు. ఈ విషాద ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

అమెరికా (America)లోని సౌత్ కరోలినాకు చెందిన 34 ఏళ్ల వధువు సమంతా హచిన్సన్.. ఆరిక్ హచిన్సన్‌ అనే వ్యక్తితో వివాహం (wedding) జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఉంగరాలు మార్చుకొని ఒకటయ్యారు. వచ్చిన బంధువులు, స్నేహితులతో కలిసి ఆనందించారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం కొత్త జంట సంతోషంగా వివాహ రిసెప్షన్ నుంచి గోల్ఫ్‌ కార్టులో ఊరేగింపుగా బయల్దేరారు. ఇంతలోనే విధి వెక్కిరించింది. వేగంగా దూసుకువచ్చిన ఓ కారు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రతకు గోల్ఫ్‌కార్టు (golf cart) దాదాపు 90 మీటర్ల దూరం ఎగిరి పడింది. ఈ ఘటనలో వధువు (Bride killed) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... వరుడు తీవ్రంగా గాయపడి (groom injured) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

MAE2.jpg

కారు డ్రైవర్‌ మద్యం మత్తులో (drunken driver) డ్రైవింగ్‌ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వరుడి మెదడుకు గాయమైందని, ఎముకలు కూడా విరిగిపోయాయని, రెండు బలమైన శస్త్రచికిత్సలు చేయవలసి వచ్చిందని అతని తల్లి తెలిపింది. వీరితో పాటు మరో ఇద్దరు కూడా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. పెళ్లైన అయిదు గంటల్లోనే ఇదంతా జరిగిపోయిందని, అరిక్‌ తన జీవితంతో ప్రేమను కోల్పోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే కోడలు అంత్యక్రియలకు.. కొడుకు వైద్య బిల్లులను చెల్లించడానికి అరిక్ తల్లి సహాయం కోసం ఫండ్‌ రైసింగ్‌ మొదలు పెట్టింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ జామీ కొమెరోస్కి(25)ను అరెస్ట్‌ చేశారు. పెళ్లి రోజే ఇంతటి ఊహించని ఘోరం జరగడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: Marriage Dates: హమ్మయ్య.. బ్యాచులర్స్‌కు మంచి రోజులొచ్చాయోచ్.. మే, జూన్ నెలల్లో పెళ్లికి మంచి ముహూర్తాలివే..!

Updated Date - 2023-05-03T12:53:04+05:30 IST