Scary Video: అమ్మ బాబోయ్.. ఇదేంటి..? గాల్లో ఎగురుకుంటూ వస్తున్న ఈ వింత వస్తువేంటో తెలిసి అవాక్కైన జనాలు..!

ABN , First Publish Date - 2023-05-20T10:30:14+05:30 IST

ప్రకృతి (Nature) సహజంగా చాలా అందగా ఉంటుంది.

Scary Video: అమ్మ బాబోయ్.. ఇదేంటి..? గాల్లో ఎగురుకుంటూ వస్తున్న ఈ వింత వస్తువేంటో తెలిసి అవాక్కైన జనాలు..!

Scary Video: ప్రకృతి (Nature) సహజంగా చాలా అందగా ఉంటుంది. ప్రకృతికి కోపం వస్తే విలయతాండవమే చేస్తుంది. ఇప్పటికే పలు సంఘటనలు దీన్ని నిరూపించాయి కూడా. అందుకే ప్రకృతిని మించిన శక్తి ఏదీ లేదని అంటారు. ప్రస్తుతం టర్కీలో ప్రకృతి విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తుఫాన్ కారణంగా ఆ దేశం అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి సంబంధించిన ఒక వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. అక్కడ వీస్తున్న భయకంరమైన ఈదురు గాల్లో ఎగురుకుంటూ వస్తున్న వింత వస్తువును చూసి అక్కడి జనాలు అవాక్కయ్యారు. అమ్మ బాబోయ్.. ఇదేంటి..? అంటూ కొద్దిసేపు పరేషాన్ అయ్యారు.

టర్కీలో (Turkey) భారీ వర్షాలకు తోడు ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని అంకారలో (Ankara) గాలులకు ఇంట్లోని ఓ భారీ సోఫా సైతం ఎగిరొచ్చింది. ఓ ఎత్తైన భవనం వైపు ఎగిరొచ్చిన ఆ సోఫా పక్కనే ఉన్న మరో బిల్డింగ్‌పై పడింది. ఇలా గాల్లో వింత వస్తువు ఎగురుకుంటూ రావడం గమనించిన అక్కడి జనాలు అమ్మ బాబోయ్.. ఇదేంటి..? అంటూ కొద్దిసేపు అయోమయానికి గురయ్యారు. ఆ తర్వాత ఆ వస్తువు భవనంపై పడడం.. అది కాస్తా సోఫా అని తెలియడంతో వారు కుదుటపడ్డారు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక వీడియో చూసిన నెటిజన్లు టర్కీలో ఇంత భయంకర పరిస్థితులు ఉన్నాయా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Wonderful Trick: ఈ యువతి టెక్నిక్ అదుర్స్.. అంత లావున్న మహిళ కాస్తా ఒక్క ట్రిక్‌తో ఎంత సన్నగా కనిపిస్తోందో మీరే చూడండి..!


Updated Date - 2023-05-20T10:30:14+05:30 IST