Turkey Syria earthquake: క్షతగాత్రురాలైన టర్కీ బాలికకు ఇండియన్ ఆర్మీ వైద్యుల చికిత్స

ABN , First Publish Date - 2023-02-10T08:11:30+05:30 IST

టర్కీ భూకంపంలో క్షతగాత్రురాలైన బాలికకు ఇండియన్ ఆర్మీ అధికారులు చికిత్స చేస్తున్నారు...

Turkey Syria earthquake: క్షతగాత్రురాలైన టర్కీ బాలికకు ఇండియన్ ఆర్మీ వైద్యుల చికిత్స
At Indian Army campTurkish girl

టర్కీ భూకంపంలో క్షతగాత్రురాలైన బాలికను రక్షించి, ఆమెను ఇండియన్ ఆర్మీ క్యాంపునకు తరలించి భారత ఆర్మీ వైద్యులు చికిత్స చేస్తున్నారు.

అంకార(టర్కీ): టర్కీ భూకంపంలో క్షతగాత్రురాలైన బాలికకు ఇండియన్ ఆర్మీ అధికారులు చికిత్స చేస్తున్నారు.(Indian Army camp) టర్కీ దేశంలో సంభవించిన భారీ భూకంపంలో(Earthquake-hit Turkey) శిథిలాల కింద చిక్కుకుపోయిన ఆరేళ్ల టర్కీ బాలిక నస్రీన్‌కు(Turkish girl) ఇండియన్ ఆర్మీ క్యాంపు అధికారులు చికిత్స చేస్తున్నారు.శిథిలాల్లో చిక్కుకుపోయిన నస్రీన్ అనే ఆరేళ్ల బాలికను సహాయ సిబ్బంది రక్షించి(Girl pulled out of debris), చికిత్స కోసం ఇండియన్ ఆర్మీకి చెందిన 16 పారాఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు.

Turkish-girl.gif

ఎడమ పాదం నుజ్జునుజ్జు అయింది....

‘‘బాలిక నస్రీన్‌ను గురువారం ఆర్మీ సహాయ శిబిరానికి తీసుకువచ్చారు. నస్రీన్ ఎడమ పాదం నుజ్జునుజ్జు అయింది...నస్రీన్ కు చికిత్స చేస్తున్నామని, ప్రస్థుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది’’ అని శిబిరంలో ఓ వైద్యుడు చెప్పారు. భూకంపంలో((2023 Turkey–Syria earthquakes) గాయాల పాలై ఆర్మీ క్యాంపులో చికిత్స పొందుతున్న బాలిక నవ్వుతూ కనిపించింది. నస్రీన్ తల్లిని కూడా రక్షించారు, కానీ దురదృష్టవశాత్తు బాలిక తండ్రి, ఇద్దరు సోదరులు తప్పిపోయారు.

ఇది కూడా చదవండి: Layoff: యాహూలోనూ ఉద్యోగాల కోత...1000మంది ఉద్యోగుల తొలగింపు

తప్పి పోయిన నస్రీన్ కుటుంబ సభ్యుల కోసం వెతుకుతున్నామని ఆర్మీ క్యాంపులోని ఓ అధికారి చెప్పారు. టర్కీ, సిరియా భూకంపంలో(Turkey Syria earthquake) మృతుల సంఖ్య 21వేలమందికి చేరగా భారతదేశ సైనిక రవాణా విమానాల్లో మొబైల్ ఆసుపత్రి నిర్వహిస్తోంది. టర్కీలో 99 మంది భారత ఆర్మీ వైద్యుల బృందం క్షతగాత్రులకు చికిత్స అందిస్తోంది. ఆగ్రాలోని ఇండియన్ ఆర్మీ ఆసుపత్రి నుంచి 45 మంది వైద్యుల బృందం టర్కీలో 30 పడకల ఫీల్డ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తోంది.

Updated Date - 2023-02-10T08:19:53+05:30 IST