Layoff: యాహూలోనూ ఉద్యోగాల కోత...1000మంది ఉద్యోగుల తొలగింపు

ABN , First Publish Date - 2023-02-10T07:27:24+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతూనే ఉంది....

Layoff: యాహూలోనూ ఉద్యోగాల కోత...1000మంది ఉద్యోగుల తొలగింపు
Yahoo Layoff

కాలిఫోర్నియా: ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ కంపెనీ అయిన యాహూ శుక్రవారం 1000 మంది ఉద్యోగులను తొలగించనుంది.(Layoff) యాహూ(Yahoo) అడ్వర్టైజింగ్ టెక్ విభాగాన్ని పునర్నిర్మించే ప్రణాళికలో భాగంగా 1000మంది ఉద్యోగులను ఈ వారంలో తొలగిస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.(Yahoo Eliminate 1,000 jobs)

అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ ఇంక్ యాజమాన్యంలోని యాహూ ఫర్ బిజినెస్ యాడ్ టెక్ యూనిట్‌లో ఉద్యోగుల సంఖ్యను దాదాపు 50శాతం తొలగించనుంది. యాహూలో 20శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తగ్గించాలని యోచిస్తోందని ఆ కంపెనీ ప్రతినిధి తెలిపారు.అనిశ్చిత ఆర్థిక వాతావరణం వల్ల యాహూ లేఆఫ్ ప్రకటించాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. కంపెనీ లాభాల్లో ఉన్నా విభజన పునర్నిర్మాణం కారణంగా ఉద్యోగాల కోతలు ఎక్కువగా ఉన్నాయని యాహూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిమ్ లాన్జోన్ చెప్పారు.

Updated Date - 2023-02-10T07:56:49+05:30 IST