SBI FD scheme: ఎస్‌బీఐలో సూపర్ ఎఫ్‌డీ.. రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.21 లక్షలు... పూర్తి వివరాలు ఇవే...

ABN , First Publish Date - 2023-05-01T21:17:54+05:30 IST

నిజానికి సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్, గ్యారంటీ ఆదాయాన్ని అందించే అనేక బ్యాంక్ డిపాజిట్లతోపాటు ప్రభుత్వ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఎస్‌బీఐ (SBI) ఆఫర్ చేస్తున్న సీనియర్ సిటిజన్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ (Senior Citizen Term Deposit Scheme) ఒకటి. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్న వృద్ధులకు ఇది చక్కటి స్కీమ్...

SBI FD scheme: ఎస్‌బీఐలో సూపర్ ఎఫ్‌డీ.. రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.21 లక్షలు... పూర్తి వివరాలు ఇవే...

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ (SBI) తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తుంటుంది. ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) చక్కటి వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంటుంది. రెగ్యులర్ ఖాతాదారులతో పోల్చితే సీనియర్ సిటిజన్లకు ఇంకాస్త ఆకర్షణీయమైన స్కీమ్స్‌‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్, గ్యారంటీ ఆదాయాన్ని అందించే అనేక బ్యాంక్ డిపాజిట్లతోపాటు ప్రభుత్వ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఎస్‌బీఐ (SBI) ఆఫర్ చేస్తున్న సీనియర్ సిటిజన్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ (Senior Citizen Term Deposit Scheme) ఒకటి. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్న వృద్ధులకు ఇది చక్కటి స్కీమ్.

ప్రయోజనాలు ఇవే....

ఈ ఎఫ్‌డీ మెచ్యూరిటీ 7 రోజుల నుంచి గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు ఉన్నట్టు ఎస్‌బీఐ వెబ్‌సైట్‌పై అందుబాటులో ఉన్న సమాచారం పేర్కొంది. రెగ్యులర్ కస్టమర్ల కంటే సీనియర్ సిటిజన్లు 0.50 శాతం ఎక్కువ వడ్డీ పొందొచ్చు. 5-10 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపైన అయితే 1 శాతం అధిక వడ్డీని ఆర్జించొచ్చు. రెగ్యులర్ కస్టమర్లకు 5-10 ఏళ్ల ఎఫ్‌డీపై 6.5 శాతం వడ్డీ లభిస్తుండగా... సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం దక్కుతుంది అన్నమాట. ఎస్‌బీఐ వీ-కేర్ డిపాజిట్ స్కీమ్ కింద అయితే అదనంగా మరో అర శాతం వడ్డీని పొందొచ్చని ఎస్‌బీఐ వెబ్‌సైట్ పేర్కొంది.

రూ.10 లక్షలు పదేళ్లలో రూ.21 లక్షలు...

సీనియర్ సిటిజన్లు రూ.10 లక్షల మొత్తాన్ని పదేళ్ల మెచ్యూరిటీతో ఏక మొత్తం డిపాజిట్ (lump sum deposit) చేశారనుకుందాం. ఎస్‌బీఐ ఎఫ్‌డీ కాలిక్యులేటర్ ప్రకారం... 7.5 శాతం వార్షిక వడ్డీతో ఇన్వెస్టర్ సంపద మెచ్యూరిటీ నాటికి రూ.21,02,349కి వృద్ధి చెందుతుంది. ఇందులో వడ్డీ ఆదాయమే రూ.11,02,349గా ఉంటుంది. కాగా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు/టర్మ్ డిపాజిట్లు సురక్షితమైనవి. ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు.

ఇవి కూడా చదవండి...

tuni train incident: సంచలన కేసులో విజయవాడ రైల్వే కోర్ట్ తీర్పు.. ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టి రాజాలపై కేసు కొట్టివేత

SBI Amrit Kalash: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఆ స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టిన బ్యాంక్..

Updated Date - 2023-05-01T21:24:19+05:30 IST