SBI Amrit Kalash: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఆ స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టిన బ్యాంక్..

ABN , First Publish Date - 2023-04-25T21:04:11+05:30 IST

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ (SBI) తన దేశీయ, ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారుల కోసం ‘ఎస్‌బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ ఎఫ్‌డీ స్కీమ్‌’ను (SBI Amrit Kalash Deposit FD Scheme) పున:ప్రవేశపెట్టింది.

SBI Amrit Kalash: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఆ స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టిన బ్యాంక్..

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ (SBI) తన దేశీయ, ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారుల కోసం ‘ఎస్‌బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ ఎఫ్‌డీ స్కీమ్‌’ను (SBI Amrit Kalash Deposit FD Scheme) పున:ప్రవేశపెట్టింది. ఆకర్షణీయ వడ్డీ రేటు ఆఫర్‌తో ఖాతాదారుల ముందుకొచ్చింది. 400 రోజుల ఎఫ్‌డీపై చక్కటి వడ్డీని అందిస్తోంది. ‘‘ రిటైల్ టర్మ్ డిపాజిట్ ‘అమృత్ కలశ్’ స్కీమ్‌ను పున: ప్రవేశ పెట్టాలని బ్యాంక్ నిర్ణయించింది. 400 రోజుల ఎఫ్‌డీపై వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది’’ అని ఎస్‌బీఐ వెబ్‌సైట్ (SBI website) పేర్కొంది. అయితే ఎస్‌బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ పరిమితకాలపు స్కీమ్ అని, 30 జూన్ 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

అమృత్ కలశ్ డిపాజిట్‌కు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇవే..

1). ఎస్‌బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ 12 ఏప్రిల్ 2023 నుంచి 30 జూన్ 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

2). డిపాజిట్ పిరియడ్ - 400 రోజులుగా ఉంది.

3). డిపాజిట్‌కు అర్హతలు:

- దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్స్(రూ.2 కోట్ల కంటే తక్కువ).

- కొత్త డిపాజిట్లు, డిపాజిట్ల రెన్యూవల్.

- టర్మ్ డిపాజిట్స్, స్పెషల్ టర్మ్ డిపాజిట్లు మాత్రమే.

4). వడ్డీ రేటు : జనరల్ పబ్లిక్ వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్లు, స్టాఫ్, స్టాఫ్ పెన్షనర్లు అదనపు వడ్డీ రేటుకు అర్హులుగా ఉన్నారు.

5). వడ్డీ చెల్లింపు:

- టర్మ్ డిపాజిట్లు - మెచ్యూరిటీని బట్టి నెలవారీ/త్రైమాసికం/ అర సంవత్సరం స్పెషల్ టర్మ్ డిపాజిట్స్.

- వడ్డీ, నికర టీడీఎస్ కస్టమర్ ఖాతాలో జమవుతాయి.

6). TDS: ఆదాయ పన్ను చట్టం ప్రకారం టీడీఎస్ రేటు వర్తిస్తుంది.

7). ప్రిమెచ్యూర్: రిటైల్ టర్మ్ డిపాజిట్ వర్తింపు విధంగా విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.

8). లోన్ ఫెసిలిటీ: ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.

9). బ్రాంచ్/ఐఎన్‌బీ/యోనో మార్గాల ద్వారా లోన్ తీసుకోవచ్చు.

10). అమృత్ కలశ్ డిపాజిట్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్రొడక్ట్ కోడ్స్ అవసరం లేదు.

కాగా ఇదే ఫీచర్లతో గత ఫిబ్రవరిలో అమృత్ కలశ్ డిపాజిట్‌ను ఎస్‌బీఐ ప్రకటించింది. అయితే 31 మార్చి 2023తో గడువు ముగిసింది.

Updated Date - 2023-04-25T21:07:26+05:30 IST