Viral Video: అది కారు అనుకున్నాడేమో.. ప్రయాణికులంతా విమానం ఎక్కుతుంటే.. పైలెట్ కిటికీ వద్ద ఏం చేస్తున్నాడో చూడండి..

ABN , First Publish Date - 2023-06-30T21:47:23+05:30 IST

కొందరు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో గానీ.. వారు చేసే పనులు చూస్తే కొన్నిసార్లు కోపం వస్తే, మరికొన్ని సార్లు తెగ నవ్వు వస్తుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో కళ్ల ముందు ఏ చిన్న విచిత్రం జరిగినా.. ఇలా వీడియో తీసి, అలా నెట్టింట్లోకి వదలడం సర్వసాధారణమైంది. వీటిలో..

Viral Video: అది కారు అనుకున్నాడేమో.. ప్రయాణికులంతా విమానం ఎక్కుతుంటే.. పైలెట్ కిటికీ వద్ద ఏం చేస్తున్నాడో చూడండి..

కొందరు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో గానీ.. వారు చేసే పనులు చూస్తే కొన్నిసార్లు కోపం వస్తే, మరికొన్ని సార్లు తెగ నవ్వు వస్తుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో కళ్ల ముందు ఏ చిన్న విచిత్రం జరిగినా.. ఇలా వీడియో తీసి, అలా నెట్టింట్లోకి వదలడం సర్వసాధారణమైంది. వీటిలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. విమానంలోకి ప్రయాణికులు ఎక్కుతున్న సమయంలో కిటికీ వద్ద పైలెట్ చేస్తున్న పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఎయిర్‌పోర్టులో ఓ విమానం బయలుదేరేందుకు సిద్ధంగా ఉంటుంది. దీంతో ప్రయాణికులంతా హడావుడిగా లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకోవైపు ఎయిర్‌పోర్టు (Airport) సిబ్బంది విమానం వెళ్లేందుకు రూట్ క్లియర్ చేస్తూ ఉంటారు. ఇంతలో పైలెట్ చేసిన పని.. అంతా అవాక్కయ్యేలా చేసింది. విమానం కిటీకీ నుంచి తల, చేతులు బయటికి పెట్టిన పైలెట్.. ఓ గుడ్డతో విమానం ముందున్న అద్దాన్ని క్లీన్ చేస్తాడు. కారు, బస్సు, లారీలను నడుపుతున్న సమయంలో డ్రైవర్లు ఎలాగైతే అద్దాలను శుభ్రం చేసుకుంటారో.. అచ్చం అలాగే ఈ పైలెట్ కూడా అద్దాలను (pilot cleaning planes windshield with cloth) శుభ్రం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Death Mystery: తెల్లారేసరికి ఇద్దరు పిల్లల మృతి.. రాత్రి పడుకునే ముందు నూడిల్స్‌తో పాటు వీటిని కూడా తినడం వల్లేనా..?

సాధారణంగా విమానాల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. అద్దాలను శుభ్రం చేసేందుకు కూడా అలాంటి సౌకర్యమే ఉంటుంది. కానీ పైలెట్ మాత్రం గుడ్డతో అద్దాన్ని శుభ్రం చేయడం చూసి అక్కడున్న వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇతను గతంలో ట్రక్ డ్రైవర్‌గా పని చేసి ఉంటాడు’’... అని కొందరు, ‘‘ఇతను ముమ్మాటికీ భారతీయుడు అయ్యుంటాడు’’.. అని మరికొందరు, ‘‘ఆహా! ఈయనకు వృత్తి పట్ల ఎంత నిబద్ధత’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో లైక్‌లను సొంతం చేసుకుంది.

Bride: అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ యువతి పెళ్లి నిన్న జరిగి ఉండేది.. కానీ సరిగ్గా వివాహానికి రెండ్రోజుల ముందు..!

Updated Date - 2023-06-30T21:55:06+05:30 IST