Shocking Video: చుట్టూ వందల కొద్దీ మొసళ్లు.. ఏమాత్రం భయపడకుండా బోటును ముందుకే పోనిచ్చాడో వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-06-02T13:46:05+05:30 IST

సోషల్ మీడియాలో (Social Media) ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.

Shocking Video: చుట్టూ వందల కొద్దీ మొసళ్లు.. ఏమాత్రం భయపడకుండా బోటును ముందుకే పోనిచ్చాడో వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

Shocking Video: సోషల్ మీడియాలో (Social Media) ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే, కొన్ని వీడియోలు చాలా ఎమోషనల్‌గా హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటే.. ఇంకొన్ని వీడియోలు మాత్రం భయభ్రాంతులకు గురిచేస్తాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. అదోక నది. అందులో పారుతున్న నీటిలో భారీ సంఖ్యలో మొసళ్లు (Crocodiles) ఉన్నాయి.

సాధారణంగా అయితే అలాంటి నదివైపు చూడటానికి కూడా చాలా మంది భయపడతారు. కానీ, ఓ వ్యక్తి ఏమాత్రం భయపడకుండా ఆ నదిలో మోటార్ బోటు (Motor Boat) వేసుకుని సాదాసీదా వెళ్లడం మనం వీడియోలో చూడొచ్చు. అతడు వెళ్తున్న బోటుకు కుప్పలు తెప్పలుగా మొసళ్లు ఎదురవుతున్న అలాగే ముందుకు వెళ్లడం వీడియోలో ఉంది. ఈ వీడియోను Oddly Terrifying అనే ట్విటర్ యూజర్ గురువారం (జూన్ 1న) షేర్ చేశారు. దాంతో ఇప్పుడీ వీడియోలో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒకరోజు వ్యవధిలోనే 10లక్షలకు పైగా వ్యూస్, 11వేలకు పైగా లైక్స్‌తో నెట్టింట దూసుకెళ్తోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Weight Loss: ఈ యువతి వయసు 28 ఏళ్లు.. బరువు 95 కిలోలు.. పెళ్లికి ముందే బరువు తగ్గేందుకు ఈమె చేసిన ఒక్క మిస్టేక్‌తో..!

Updated Date - 2023-06-02T13:46:05+05:30 IST