Husband: కొడుకు పెళ్లిలో వేరే వాళ్లతో డాన్స్ చేసిన భార్య.. మర్నాడే ఇద్దరిని చంపేసిన భర్త.. ఆపై హాయిగా నిద్రపోతోంటే..!

ABN , First Publish Date - 2023-05-17T16:59:11+05:30 IST

పెళ్లంటే ఎంతో సందడి.. సంతోషం. బంధుమిత్రులు.. స్నేహితులు.. ఇలా ఒక్కరేంటి? తెలిసిన వారంతా ఇంటికొచ్చారంటే.. ఆ కుటుంబానికి ఎంత సంతోషం ఉంటుంది. పైగా పెళ్లంటే మేళతాళాలు.. డీజీ సౌండ్లు. లైటింగ్‌లు..

Husband: కొడుకు పెళ్లిలో వేరే వాళ్లతో డాన్స్ చేసిన భార్య.. మర్నాడే ఇద్దరిని చంపేసిన భర్త.. ఆపై హాయిగా నిద్రపోతోంటే..!
dancing

పెళ్లంటే ఎంతో సందడి.. సంతోషం. బంధుమిత్రులు.. స్నేహితులు.. ఇలా ఒక్కరేంటి? తెలిసిన వారంతా ఇంటికొచ్చారంటే.. ఆ కుటుంబానికి ఎంత సంతోషం ఉంటుంది. పైగా పెళ్లంటే మేళతాళాలు.. డీజీ సౌండ్లు. లైటింగ్‌లు.. ఇలా పెళ్లి మండపం కళకళలాడిపోతుంది. ఇక పెళ్లి వేడుకలో మ్యూజిక్ తగినట్టుగా డ్యాన్సులు వేయడం.. ఉల్లాసంగా స్టెప్పలు వేయడం ఇదంతా వగేరా ప్రతీ వివాహ వేడుకలో జరిగే తంతే. ఇదంతా ఎందుకంటారా? పెళ్లిలో డ్యాన్స్ చేయడమే ఆమెకు శాపమైంది?. ఇద్దరు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే జరుగుతుంది. అందుకోసం దీన్ని ఎంతో గ్రాండ్‌గా చేసుకుంటారు. ఎవరి స్థోమత మేరకు వాళ్లు ఏర్పాట్లు చేసుకుంటారు. కొంత మంది మండపాల్లో చేసుకుంటే.. ఇంకొందరు ఇంటి దగ్గరే చేసుకుంటారు. అయితే ఆ తల్లి కూడా కొడుకు పెళ్లి అవుతుందని ఎంతో సంబరపడింది. వచ్చిన బంధుమిత్రులను పలకరిస్తూ సంతోషంగా గడుపుతోంది. అంతేకాదు వారితో కలిసి డ్యాన్సులు కూడా చేసింది. అదే ఆమెకు శాపమైంది. అలా నృత్యం చేయడం భర్తకు నచ్చలేదు. కోపంతో రగిలిపోయిన అతడు అన్నంత పని చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కబీర్‌ధామ్‌ జిల్లా కవర్ధ పరిధి బంగౌరా గ్రామంలో తిన్హా బైగా అనే వ్యక్తి కుమారుడి వివాహం రెండు రోజుల క్రితం ఎంతో ఘనంగా జరిగింది. సోమవారం కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లిమండపంలో ఆనందంగా నృత్యాలు చేశారు. తిన్హా బైగా భార్య కూడా వారితో కలిసి డ్యాన్సులు చేసింది. ఇది అతనికి కోపం తెప్పించింది. ఇతరులతో కలిసి నృత్యం చేస్తున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు. కోపంతో రగిలిపోతున్న తిన్హా బైగా కత్తి తీసుకొని భార్యపై దాడికి తెగబడ్డాడు. దీన్ని గమనించిన నిందితుడి సోదరులు.. బావమరుదులు ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపైనా తిన్హా బైగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నిందితుడి ఇద్దరు సోదరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. భార్య, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు.

విచిత్రమేంటంటే.. దాడిలో ఇద్దరు సోదరులు ప్రాణాలు కోల్పోతే ఎలాంటి బాధ లేకుండా తిన్హా బైగా అక్కడే మంచంపై హాయిగా నిద్రపోవడం ఆశ్చర్యం కలిగించింది. అతని తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శుభకార్యం జరిగిన ఇంట్లో సంతోషంగా ఉండాల్సిన వాళ్లు విషాదంలో మునిగిపోయారు.

ఇది కూడా చదవండి: Indian Railway: రైలు ప్రయాణీకులకు బంపరాఫర్.. చేతిలో డబ్బుల్లేకున్నా ట్రైన్‌లో జర్నీ చేయొచ్చు.. కానీ ఒకే ఒక్క కండీషన్ ఏంటంటే..!

Updated Date - 2023-05-17T17:28:58+05:30 IST