Jawan: బాలీవుడ్ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నాడా.. క్లారిటీ ఇదిగో!

ABN , First Publish Date - 2023-03-02T15:16:42+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). సినిమాల నుంచి దాదాపుగా ఐదేళ్ల పాటు విరామం తీసుకున్నారు. ప్రస్తుతం వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ‘జవాన్’, ‘ఢంకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Jawan: బాలీవుడ్ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నాడా.. క్లారిటీ ఇదిగో!

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). సినిమాల నుంచి దాదాపుగా ఐదేళ్ల పాటు విరామం తీసుకున్నారు. ప్రస్తుతం వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ‘జవాన్’, ‘ఢంకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘జవాన్’ (Jawan) పాన్ ఇండియాగా రూపొందుతుంది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర ఉంది. ఆ పాత్ర‌ను టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) చేయనున్నారని గతంలో రూమర్స్ హల్‌చల్ చేశాయి. తాజాగా ఈ రూమర్స్‌పై క్లారిటీ వచ్చింది.

‘జవాన్’ సినిమాలోని కీలకమైన పాత్ర కోసం మేకర్స్ అల్లు అర్జున్‌ను సంప్రదించిన మాట వాస్తవమే. బన్నీ ‘పుష్ప: ది రూల్’ లో బిజీగా ఉండటంతో ఆ పాత్రను చేయడానికి చేయడానికి అంగీకరించలేదట. ఈ క్యారెక్టర్ కోసమే గతంలో కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దలపతి విజయ్‌ను మేకర్స్ సంప్రదించారు. ఏమైందో తెలియదు కానీ ఆ పాత్రను చేయడానికి విజయ్ కూడా ఆసక్తి చూపించలేదు. అయితే, ఈ క్యారెక్టర్‌ను సౌతిండియాకు చెందిన నటులు పోషిస్తే బాగుంటుందని చిత్రబృందం భావిస్తుంది. అందుకే పలువురితో చర్చలు జరుపుతుంది. కానీ, ఈ పాత్రను చేయడానికి ఎవరు కూడా ఆసక్తి చూపించడం లేదు.

‘జవాన్’ కు ఫేమస్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. షారూఖ్‌ సొంత నిర్మాణ సంస్థ రెడ్ ఛిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 2న విడుదల కానుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-02T15:33:15+05:30 IST